దర్శకుడిగా తనదైన శైలి, కథనంతో కోట్లాది ప్రేక్షకులను ఆకట్టుకున్న లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఇప్పుడు కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల ద్వారా దర్శకుడిగా తమిళ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న లోకేశ్ కనగరాజ్ ఇప్పుడు నటుడిగా కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నారు.
Read Also: Mari Selvaraj: గొప్ప మనసు చాటుకున్న కోలీవుడ్ డైరెక్టర్
గత కొన్ని నెలలుగా ఆయన నటన రంగంలోకి అడుగుపెడతారనే వార్తలు వినిపిస్తున్నాయి.తాజాగా అధికారికంగా ‘డీసీ (DC)’ అనే కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమాకు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు.సన్ పిక్చర్స్ (Sun Pictures) నిర్మిస్తుంది. లోకేశ్ కనగరాజ్ సరసన వామికా గబ్బీ (Vamika Gabbi) కథానాయికగా నటిస్తుంది.
అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ వీడియోలో లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) మునుపెన్నడూ చూడని మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. శరీరం నిండా రక్తం మరకలతో, సరికొత్త అవతారంలో ఉన్న ఆయన లుక్ సినీ అభిమానుల దృష్టిని విశేషంగా ఆకర్శిస్తుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: