📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Lokesh Kanagaraj: సంజయ్ సార్ మాటల్లో నిజం ఉంది – లోకేశ్ కనగరాజ్ క్షమాపణ!

Author Icon By Ramya
Updated: July 18, 2025 • 2:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

లోకేశ్ కనగరాజ్ క్షమాపణలు: సంజయ్ దత్‌ను సరిగ్గా వాడుకోలేకపోయినందుకు పశ్చాత్తాపం

ప్ర‌స్తుతం త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌లో స్టార్ డైరెక్ట‌ర్‌గా వెలుగొందుతున్న లోకేశ్‌ కనగరాజ్ (Lokesh Kanagaraj), త‌న ద‌ర్శ‌క‌త్వ ప్ర‌స్థానంలో వ‌రుస విజ‌యాల‌ను సాధించారు. ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి సినిమాలు ఆయ‌న‌కు అపార‌మైన ప్రేక్ష‌కాద‌ర‌ణ‌ను తెచ్చిపెట్టాయి. ఆయ‌న సినిమాలు తెలుగు ప్రేక్షకులను కూడా ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. ప్ర‌స్తుతం సూప‌ర్‌స్టార్ రజనీకాంత్‌తో ‘కూలీ’ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. ఇందులో నాగార్జున, సత్యరాజ్, శ్రుతిహాసన్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌గా, బాలీవుడ్ న‌టుడు ఆమిర్ ఖాన్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.

Lokesh Kanagaraj: సంజయ్ సార్ మాటల్లో నిజం ఉంది – లోకేశ్ కనగరాజ్ క్షమాపణ!

‘లియో’లో సంజయ్ దత్ పాత్ర‌పై విమర్శలు

లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహించిన ‘లియో’ (Leo) చిత్రంలో బాలీవుడ్ సీనియ‌ర్ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt) ఒక కీలక పాత్రలో నటించారు. అయితే, ఆ పాత్ర అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సంజయ్ దత్ లాంటి ఒక గొప్ప నటుడిని సరిగ్గా ఉపయోగించుకోలేదనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ పాత్రకు సరైన గుర్తింపు లేకపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. ఇటీవల సంజయ్ దత్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. లోకేశ్ తనను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడని, తన క్యారెక్టర్ చాలా చిన్నదిగా, ప్రభావం లేనిదిగా చూపించాడని, తనను వేస్ట్ చేసుకున్నాడని సంజయ్ దత్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, చాలామంది నెటిజన్లు సంజయ్ దత్ మాటలతో ఏకీభవిస్తూ లోకేశ్‌పై విమర్శలు గుప్పించారు.

సంజయ్ దత్‌కు క్షమాపణలు చెప్పిన లోకేశ్ కనగరాజ్

ఈ వివాదంపై లోకేశ్‌ కనగరాజ్ తాజాగా స్పందించారు. ‘కూలీ’ సినిమా ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఆయన మాట్లాడుతూ, తన తప్పును ఒప్పుకున్నారు. “సంజయ్ సార్ మాటల్లో నిజం ఉంది. ‘లియో’లో ఆయన పాత్రకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేకపోయాను. అది నా తప్పు. ఇప్పుడు నేను గుర్తించాను. భవిష్యత్తులో ఒక అవకాశం వస్తే, ఆయన ఇమేజ్‌కి తగిన పాత్రను అద్భుతంగా డిజైన్ చేస్తా. ఈ విషయంలో ఆయనను క్షమించమని కోరుతున్నా” అని లోకేశ్ అన్నారు. లోకేశ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తన తప్పును బహిరంగంగా అంగీకరించడం, క్షమాపణలు చెప్పడం లోకేశ్ పెద్ద మనసును తెలియజేస్తుందని నెటిజ‌న్లు ప్ర‌శంసిస్తున్నారు.

‘లియో’ సినిమాలో సంజయ్ దత్ పాత్రపై ఏమంటున్నారు?

సంజయ్ దత్ తన పాత్ర చిన్నదిగా, ప్రభావం లేనిదిగా ఉందని వ్యాఖ్యానించారు.

లోకేశ్ కనగరాజ్ ఈ విమర్శలపై ఎలా స్పందించారు?

తన తప్పు గుర్తించి, భవిష్యత్తులో మంచి పాత్ర ఇవ్వబోతానని చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Balakrishna: వైరల్ వీడియో..స్క్విడ్ గేమ్ ఆడిన బాల‌కృష్ణ, రాజీవ్ క‌న‌కాల‌

Breaking News latest news Leo Movie Lokesh Apology Lokesh Kanagaraj Sanjay Dutt Sanjay Dutt Leo Role Telugu News vijay

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.