📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest news: Lokah Chapter1: లోకా చాప్టర్ 1.. చంద్ర’ రివ్యూ

Author Icon By Saritha
Updated: October 31, 2025 • 3:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మలయాళంలో కొత్త ప్రయోగం

మలయాళ సినీ పరిశ్రమలో సూపర్ హీరో కాన్సెప్ట్‌తో కొత్త ప్రయోగంగా రూపొందిన చిత్రం లోకా చాప్టర్ 1: చంద్ర. కల్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) ప్రధాన పాత్రలో(Lokah Chapter1) నటించిన ఈ సినిమాను డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించగా, దుల్కర్ సల్మాన్ సమర్పించారు. కేవలం ₹30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ₹300 కోట్లకుపైగా కలెక్షన్ సాధించి సంచలనం సృష్టించింది. థియేటర్లలో విజయవంతమైన ఈ సినిమా ఇప్పుడు జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Read also: కోటి ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎన్డీయే మేనిఫెస్టో

Lokah Chapter1: లోకా చాప్టర్ 1.. చంద్ర’ రివ్యూ

చంద్ర శక్తులు రహస్యమా లేక ప్రతీకారమా?

కథలో చంద్ర (కల్యాణి ప్రియదర్శన్) ఒక కొత్త నగరానికి వలసవచ్చి, సాధారణ జీవితాన్ని గడపాలనుకుంటుంది. అయితే ఆమె చుట్టూ ఎప్పుడూ ఒక రహస్య వాతావరణం ఉంటుంది. ఎదురింట్లో నివసించే సన్నీ (నస్లెన్) ఆమెను చూసి ఆకర్షితుడవుతాడు, కానీ ఆమె జీవితం వెనుక దాగిన గూఢ రహస్యాన్ని అతడు గ్రహించలేడు.

నగరంలో ఆర్గాన్ మాఫియా చెలరేగిపోతుంది ఒంటరిగా ఉన్న వారిని టార్గెట్ చేస్తూ కిడ్నాప్ చేస్తారు. ఒక రోజు చంద్రను కూడా అదే గ్యాంగ్ దాడి చేస్తుంది, కానీ ఆ క్షణంలోనే ఆమెలోని అసాధారణ శక్తులు వెలుగులోకి వస్తాయి. ఆమె ప్రతిఘటించి వారిని అంతమొందిస్తుంది. అప్పుడు సన్నీకి చంద్ర సాధారణ యువతి కాదని తెలుస్తుంది. ఆమె శక్తుల మూలం ఏమిటి, గతంలో ఏమి జరిగిందనే అంశాలు కథను ఉత్కంఠభరితంగా మలుస్తాయి.

మీక్ష హీరోయిన్ సెంట్రిక్ సూపర్ హీరో ఫిల్మ్

సాధారణంగా సూపర్ హీరో సినిమాలు హీరోలకే పరిమితమవుతుంటాయి, కానీ ఈసారి దర్శకుడు డొమినిక్ అరుణ్ ఒక మహిళా సూపర్ హీరో కాన్సెప్ట్‌ను ఆసక్తికరంగా చూపించాడు. చంద్ర పాత్రలో కల్యాణి ప్రియదర్శన్(Lokah Chapter1) అద్భుతంగా ఒదిగిపోయింది. యాక్షన్ సీన్స్‌లో ఆమె ప్రెజెన్స్ బలంగా కనిపిస్తుంది.

నస్లెన్ తన పాత్రలో సహజంగా నటించాడు. టోవినో థామస్, దుల్కర్ సల్మాన్ తాత్కాలిక పాత్రలుగా కనిపించినా, సీక్వెల్‌కి దారి తీసే సూచనలుగా ఉంటాయి. విజువల్ ఎఫెక్ట్స్ అవసరమైతేనే వినియోగించడంలో దర్శకుడు జాగ్రత్త వహించాడు. సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవి పనితనం అద్భుతం, జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్లింగ్ ఫీలింగ్ ఇస్తుంది.

ముగింపు

‘లోకా చాప్టర్ 1: చంద్ర’ మలయాళ సినిమా ప్రపంచంలో కొత్త మార్గం చూపించే ప్రయత్నం. కథ నెమ్మదిగా నడిచినా, భావోద్వేగాలు మరియు మిస్టరీ కలబోత ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. సీక్వెల్‌పై ఆసక్తి రేకెత్తించే విధంగా దర్శకుడు సినిమా ముగింపును మలిచాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Dominic Arun Dulquer Salmaan Jio Hotstar kalyani priyadarshan Latest News in Telugu loka chapter 1 chandra Malayalam movie review Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.