చిన్న సినిమాగా వచ్చి పెద్ద సాధించిన సినిమా ‘లిటిల్ హార్ట్స్’(Little Hearts). థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి రెడీ అయింది. సినిమా థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ఇప్పుడు ఓటీటీలోనూ అదే స్థాయిలో దూసుకెళ్తుంది.
Zubeen Garg: జుబీన్ గార్గ్ మృతి కేసులో కీలక ట్విస్ట్
కేవలం రూ.2.4 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.40 కోట్ల వరకు వసూల్లు రాబట్టింది. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ (Digital platform) లో రికార్డులు తిరగరాస్తుంది. మౌళి తనూజ్, శివానీ నాగారం నటించిన ఈ సినిమా అక్టోబర్ 1న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ (ETV Win) లోకి వచ్చేసింది. థియేటర్ల కంటే అదనపు రన్ టైమ్ తో ఈ మూవీ ప్రీమియర్ అవుతుంది.
తొలి రెండు రోజుల్లోనే ఈ లిటిల్ హార్ట్స్ మూవీ 100 మిలియన్స్ అంటే దాదాపు 10 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డ్ అందుకుంది. ఈ సినిమా నెల రోజుల్లోపే ఓటీటీ (OTT) లోకి వచ్చిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ మౌత్ టాక్ వచ్చింది.
తక్కువ సమయంలోనే భారీ బడ్జెట్ సినిమాలకు ధీటుగా ఓ రేంజ్ వసూల్లు రాబట్టింది.ప్రస్తుతం ఈ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల (Rajiv Kanakala) కీలకపాత్ర పోషించారు. 90’S వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ నిర్మించారు. కేవలం 2 కోట్లతో నిర్మించిన ఈ మూవీ రూ.40 కోట్లు రాబట్టింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: