కొద్ది రోజుల క్రితం మెగా ఫ్యామిలీకి సంబంధించిన ప్రముఖ జంట వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి తాము త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నామని అధికారికంగా ప్రకటించారు. ఈ శుభవార్త మెగా అభిమానుల మధ్య హర్షాతిరేకాలను రేపింది. మెగా వారసుడు వస్తాడా లేదా వారసురాలా అనే ఆసక్తి అభిమానుల్లో గట్టిగానే కనిపిస్తోంది.
భార్య కోసం స్వయంగా పిజ్జా చేసిన వరుణ్ తేజ్
ప్రెగ్నెంట్‌గా ఉన్న భార్య లావణ్య త్రిపాఠి కోసం వరుణ్ తేజ్ స్వయంగా కిచెన్‌లోకి అడుగుపెట్టి పిజ్జా తయారు చేసిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.తన కోసం భర్త పడుతున్న కష్టాన్ని వీడియో తీసి లావణ్య త్రిపాఠి షేర్ చేశారు. ఇక వరుణ్ తేజ్ చేసిన ఆ పిజ్జా అయితే చూస్తేనే యమ్మీ అని అనిపిస్తోంది. తన భార్యకు సేవలు చేసే సమయం ఇదే అని వరుణ్ తేజ్ ఇలా టేస్టీ టేస్టీ పిజ్జా చేసినట్టుగా కనిపిస్తోంది. భార్య కోసం వరుణ్ తేజ్ చాలానే కష్టపడుతున్నాడని, ఇంత ప్రేమించే భర్త దొరకడం లావణ్య అదృష్టం అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
వరుణ్ తేజ్ సినీ ప్రయాణం
వరుణ్ తేజ్ సినీ ప్రయాణంలో ఫిదా, తొలిప్రేమ వంటి సినిమాలు భారీ విజయాలను సాధించగా, ఇటీవలి కాలంలో ఆయనకు వాణిజ్య పరంగా సక్సెస్‌లు దక్కడం కాస్త తగ్గింది. అయితే మెగా ఫ్యామిలీలో కొత్త కథల్ని, ప్రయోగాల్ని చేసే హీరోగా వరుణ్ తేజ్‌కు మంచి పేరు ఉంది. ఇప్పుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ఓ తెలుగు, కొరియన్ మూవీని చేస్తుండగా, ఇది కామెడీ, థ్రిల్లర్‌గా ఉండనుందని సమాచారం.
లావణ్య త్రిపాఠి – పెళ్లి తర్వాత ఆచితూచి ఎంపికలు
పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి సినిమా ఎంపికల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. పెళ్లి తర్వాత సతీ లీలావతి అనే మూవీని పూర్తి చేశారు. ఇటీవలే ఈ చిత్రం డబ్బింగ్ పనులు కూడా మొదలయ్యాయి. జూన్‌లో ఈ మూవీని విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ చిత్రంతో లావణ్య మళ్లీ తన నటనను నిరూపించుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు.
Read also: Actor: ఇండియాలో ఫారిన్ ఎడ్యుకేషన్ విధానాన్ని తీసుకు రాబోతోన్నాం:మంచు విష్ణు