మెగా కుటుంబంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి (Varun Tej and actress Lavanya Tripathi) దంపతులకు బాబు పుట్టాడు. హైదరాబాద్‌లోని ప్రముఖ రెయిన్‌బో ఆసుపత్రిలో లావణ్య బుధవారం తెల్లవారు జామున పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ హర్షవార్త తెలిసిన క్షణాల్లోనే సినీ వర్గాలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షల సందడి చేస్తున్నారు.
వరుణ్ తేజ్, లావణ్య వివాహం , 2023 లోజరిగింది. అప్పటి నుంచి మెగా ఫ్యామిలీ (Mega Family) లో కొత్త జంటగా ఈ ఇద్దరూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తాజాగా వారిద్దరి జీవితంలోకి వచ్చిన చిన్నారి, కుటుంబానికే కాదు, అభిమానులందరికీ సంతోషం నింపాడు.
మెగాస్టార్ చిరంజీవి
ఈ వార్త తెలియగానే మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తన తాజా సినిమా మన శంకరవరప్రసాద్‌గారు షూటింగ్ స్పాట్ నుండి నేరుగా ఆసుపత్రికి వెళ్లినట్లు సమాచారం. అక్కడ వరుణ్–లావణ్యలను కలిసి శుభాకాంక్షలు తెలిపారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కొత్త బిడ్డ రాకతో కుటుంబంలో మరింత ఉత్సాహం వెల్లివిరిసిందని చెబుతున్నారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
Read hindi news:hindi.vaartha.com
Read Also: