📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Lavanya Tripathi: నా కుటుంబం జోలికి ఎవరు వచ్చినా నేను ఊరుకోను

Author Icon By Saritha
Updated: February 12, 2026 • 4:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) కొణిదెల, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ సతీ లీలావతి. తాతినేని సత్య ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్లపై నాగ మోహన్ నిర్మించారు. తాజాగా విడుదల తేదీ ఖరారు చేశారు. మార్చి 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో బుధవారం రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్‌కు సంబంధించిన ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. తన కుటుంబం గురించి ఏదైనా తప్పుగా మాట్లాడితే తాను ఊరుకోనని అన్నారు.

Read Also: Ghooskhore Pandat: పేరు మారిస్తేనే సినిమా విడుదల: సుప్రీం

I will not tolerate anyone who comes to my family.

లావణ్య త్రిపాఠి స్ట్రాంగ్ కౌంటర్

ఇటీవల రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు కవలలు జన్మించిన సమయంలో, ఓ నెటిజన్ పోస్టుకు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. దీని గురించి ఆమెను ప్రశ్నించగా.. అలాంటి ఫ్యామిలీలో భాగమవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కవలలు పుట్టారని మేమంతా హ్యాపీగా ఉన్న సమయంలో, ఒక వ్యక్తి పెట్టిన పోస్ట్‌ ఇబ్బందిగా అనిపించింది.

ఇటీవల జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చిరంజీవి (Chiranjeevi) చేసిన హాస్యభరిత వ్యాఖ్యలను కొందరు నెటిజన్లు వక్రీకరించి, మెగా కుటుంబంలో వివక్ష ఉందని ఆరోపించారు. దీనిపై లావణ్య స్పందిస్తూ, నా కుటుంబం జోలికి ఎవరు వచ్చినా నేను ఊరుకోను. మా మావయ్య చిరంజీవి మహిళలను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడే స్థాయి వారికి లేదు అని అన్నారు. ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందుకే అలా రిప్లై ఇచ్చా. నా ఫ్యామిలీ గురించి ఏదైనా తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను అని లావణ్య సమాధానమిచ్చింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anandi Art Creations Dev Mohan Latest News in Telugu Naga Mohan Sathi Leelavathi Tatineni Satya telugu movie Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.