📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest web Series: కొత్త వెబ్ సిరీస్ తో ‘మీనా’

Author Icon By Saritha
Updated: February 21, 2026 • 1:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Latest web Series: వెండితెరపై అలరించిన నటి మీనా (Meena), ఇప్పుడు ఓటిటి (OTT) వేదికగా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘రోస్లిన్’ ఈ నెల 27వ తేదీ నుంచి జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా మీనా తన సినీ కెరీర్, వ్యక్తిగత జీవితం, మారుతున్న కాలం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Read Also: Athadu Re Release: ‘అతడు’ సినిమా రీ-రిలీజ్

Latest web Series: ‘Meena’ with new web series

నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న మీనా

ఆ రోజుల్లో పండుగలను కూడా జరుపుకోలేనంత బిజీగా ఉండేవారట. అందరూ సరదాగా పండుగ జరుపుకుంటుంటే, నేను షూటింగ్ సెట్‌లో మేకప్‌తో ఉండాల్సి వచ్చేది. చాలాసార్లు పండుగలకు దూరమయ్యానని బాధపడేదాన్ని. కానీ మా అమ్మ చెప్పిన మాట నాలో ధైర్యాన్ని నింపింది. ‘పండుగ ఎవరైనా చేసుకుంటారు, కానీ వందల మందితో కలిసి పని చేసే అవకాశం కొందరికే దక్కుతుంది’ అని అమ్మ అనేవారు. ఆ తర్వాత నుంచి సెట్‌నే నా పండుగగా భావించాను” అని ఆమె నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

రోస్లిన్’ సిరీస్‌లో మీనా తల్లి పాత్రలో కనిపించబోతున్నారు. ‘‘నేను స్వయంగా తల్లిని కాకముందు చేసిన పాత్రలకు, ఇప్పడు చేస్తున్న పాత్రలకు చాలా తేడా ఉంది. ఇప్పుడు ఆ ఎమోషన్స్ నా మనసు లోతుల్లో నుంచి వస్తున్నాయి. ప్రతి డైలాగ్ నా జీవితానికి కనెక్ట్ అవుతున్నట్లు అనిపిస్తుంది” అని అన్నారు.

నేటి తరం పిల్లలపై మీనా అభిప్రాయం

ఇప్పటి పిల్లలకు టెక్నాలజీ వల్ల ప్రతి విషయంపై ముందే అవగాహన ఉంటోందని, మనం ఏదైనా చెప్పబోతే ‘మాకు తెలుసులే’ అన్నట్లుగా ప్రవర్తిస్తారని ఆమె నవ్వుతూ చెప్పారు. “పిల్లలకు ఏది సరైనదో వివరించడం మాత్రమే మన బాధ్యత. వారిని నియంత్రించడం లేదా మన మాట వినేలా బలవంతం చేయడం ఇప్పుడు సాధ్యం కాదు” అని ఆమె నేటి తల్లిదండ్రుల గురించి వివరించారు.


Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Actress Meena Jio Hotstar Latest News in Telugu Meena New Web Series Meena OTT Debut Roslin Web Series Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.