📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు మూడో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి నేడు, రేపు స్కూళ్లకు సెలవు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! నేటి బంగారం ధర యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు ఫలితాలు రేపు విడుదల SBI యోనో 2.0.. ఫీచర్లు ఇవే పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు మూడో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి నేడు, రేపు స్కూళ్లకు సెలవు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! నేటి బంగారం ధర యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు ఫలితాలు రేపు విడుదల SBI యోనో 2.0.. ఫీచర్లు ఇవే

Latest News: Usha Mulpuri కోడల్ని కూతురిలా చూసుకున్నాం.. కానీ వేరు కాపురం పెట్టింది: నాగశౌర్య తల్లి

Author Icon By Anusha
Updated: September 1, 2025 • 11:07 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాలీవుడ్‌లో యంగ్ హీరోల్లో అత్యంత హ్యాండ్సమ్‌గా చెప్పుకునే వారిలో ఒకరు నాగశౌర్య. సాఫ్ట్ లుక్, క్యూట్ స్మైల్, అందమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆయనకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. 2011లో వచ్చిన క్రికెట్ గర్ల్స్ & బీర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగశౌర్య, మొదట్లో ఎక్కువ గుర్తింపు తెచ్చుకోలేకపోయినా క్రమంగా తన నటనతో, కృషితో పరిశ్రమలో స్థిరపడ్డాడు.ఆ తర్వాత వచ్చిన లక్ష్మీ రావె మా ఇంటికి, ఊహలు గుసగుసలాడే (oohalu gusagusalade).వంటి సినిమాలు ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చాయి. ముఖ్యంగా ఊహలు గుసగుసలాడే చిత్రం నాగశౌర్య కెరీర్‌లో మలుపు తీసుకువచ్చింది. ఈ సినిమాలో ఆయన అందించిన లవర్ బాయ్ పెర్ఫార్మెన్స్ యువతలో మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆయన నటించిన జ్యో అచ్యుతానంద మల్టీస్టారర్ హిట్ అవ్వడంతో ఆయన పేరును మరింత ఎత్తుకి తీసుకెళ్లింది.

యాక్షన్ జానర్‌లో

కామెడీ, రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామా జానర్స్‌లో నాగశౌర్య మంచి గుర్తింపు పొందాడు. ఛలో సినిమాలో ఆయన యూత్‌ఫుల్ ఎనర్జీ, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అమ్మమ్మ గారిల్లు, వరుడు కావలెను వంటి చిత్రాల్లో ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి. అలాగే సమంత ప్రధాన పాత్రలో వచ్చిన ఓ బేబీ సినిమాలో నాగశౌర్యకు పరిమితమైన రోల్ ఉన్నా, ఆయన నటన సినిమాకు హైలైట్ అయ్యింది.యాక్షన్ జానర్‌లో కూడా తనను నిరూపించుకోవాలని చూసిన నాగశౌర్య అశ్వత్థామ చిత్రంతో కొత్త ప్రయోగం చేశాడు. ఈ సినిమాలో ఆయన మాస్ లుక్, యాక్షన్ సీన్స్ బాగా నప్పాయి. అయితే, కెరీర్‌లోకి వచ్చిన 14 ఏళ్లలో ఒకట్రెండు మినహా పెద్ద హిట్లు దక్కకపోవడం ఆయన కెరీర్‌లో మైనస్‌గా మారింది. అయినప్పటికీ ఆయన ప్రతిసారీ కొత్త కథలతో, కొత్త పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.

Latest News

ఇన్నాళ్లూ తల్లిదండ్రులతో ఉన్న నాగశౌర్య

ఇండస్ట్రీలోకి వచ్చి 14 ఏళ్లయినా ఒకట్రెండు సినిమాలు తప్ప చెప్పుకోవడానికి పెద్ద హిట్లు లేవనే చెప్పాలి. 2023లో ‘రంగబలి’తో ఓ మోస్తరు హిట్ అందుకున్న నాగశౌర్య చాలా గ్యాప్ తీసుకున్నాడు. త్వరలోనే ‘బాయ్ బాయ్ కార్తీక్’, ‘నారీ నారీ నడుమ మురారీ’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.ఇక ఆయన వ్యక్తిగత విషయానికొస్తే 2022 నవంబర్‌లో బెంగళూరుకు చెందిన అనుషా శెట్టిని నాగశౌర్య (Naga Shaurya) వివాహం చేసుకున్నాడు. గత ఏడాదే ఈ దంపతులకు ఓ పాప పుట్టింది. ఇన్నాళ్లూ తల్లిదండ్రులతో ఉన్న నాగశౌర్య ఇప్పుడు వేరే కాపురం పెట్టాడట. ఈ విషయాన్ని ఆయన తల్లి ఉషా ముల్పురి తాజా ఇంటర్వూలో వెల్లడించారు. పెళ్లయ్యాక వేరు కాపురం ఉంటానని శౌర్య చిన్నప్పటి నుంచే చెప్పేవాడు. ఇందరు మంచివాళ్లు ఒకేచోట ఉండకూడదు’ అనేది తన నమ్మకం. చెప్పినట్లుగానే కొడుకు, కోడలు వేరే ఇంట్లో ఉంటున్నారు. నాకు ఇద్దరు కొడుకులు.. చిన్నప్పుడు వాళ్లిద్దరికీ ఆస్తమా ఉండేది. అందుకే స్కూలుకు పంపించకుండా ఇంట్లోనే చదివించేదాన్ని.

ఆమెని కోడలిగా కాకుండా కూతురిలా చూసుకున్నాం

రోజంతా వాళ్లతో గడిపేదాన్ని. ఇప్పుడు వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుని వేరు కాపురాలు పెట్టుకోవడంతో ఇళ్లంతా బోసపోయింది’ అంటూ ఉష భావోద్వేగానికి లోనయ్యారు.మా చిన్న కోడలు అనూషతో గతంలో మా కుటుంబానికి పరిచయం ఉంది. చాలా మంచి అమ్మాయి. తను శౌర్యకి మంచి జోడీ. ఆమెని కోడలిగా కాకుండా కూతురిలా చూసుకున్నాం. తన కూడా మమ్మల్ని మమ్మీ, డాడీ అని పిలుస్తుంది. ఎంతో బాగా ఆలోచించే అమ్మాయి. అయితే పెళ్లయిన కొద్దిరోజులకే వాళ్లు వేరు కాపురం పెట్టారు. అలా ఉండాలని మేం ముందే మాట్లాడుకున్నాం. దూరంగా ఉంటేనే బంధాలు బలపడతాయని అనుకున్నాం. అందుకే బాధగా ఉన్నా ఆ నిర్ణయం తప్పలేదు. కానీ కొడుకు, కోడలు, మనవరాలిని బాగా మిస్ అవుతున్నా’ అని ఆమె చెప్పుకొచ్చారు ఉషా ముల్పురి ప్రస్తుతం ఫిల్మ్ ప్రొడక్షన్స్‌తో పాటు రెస్టారెంట్ బిజినెస్‌లోనూ రాణిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఆమెకు చాలా రెస్టారెంట్లు ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/allu-arjun-best-actor-award-gama/cinema/539100/

Breaking News latest news naga shaurya debut cricket girls and beer naga shaurya handsome hero telugu naga shaurya hit movies list Telugu News tollywood young hero naga shaurya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.