టాలీవుడ్‌లో ఎంతో మంది నటులు తమ ప్రతిభతో ప్రేక్షకుల గుండెల్లో నిలిచారు. వారిలో రామచంద్ర ఒకరు. చిన్న పాత్రలు అయినా, తన ప్రత్యేక శైలి, టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించగలిగిన కమెడియన్ రామచంద్ర (Comedian Ramachandra) ప్రస్తుతం చాలా క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
గత కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ, ఇప్పుడు పూర్తిగా మంచానికే పరిమితమయ్యారు. పెరాలసిస్ రావడంతో ఆయన కదల్లేని స్థితిలో జీవితం గడపాల్సి వస్తోంది. ఈ పరిస్థితి గురించి ఇటీవల బయటకు రావడంతో సినీ పరిశ్రమకు, అభిమానులకు షాక్ తగిలింది. ఎప్పుడూ నవ్వులు పంచిన ఒక నటుడు ఇంత కష్టంలో ఉన్నాడని తెలుసుకున్న వారంతా దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
కాదంబరి కిరణ్ రామ చంద్రను ఆదుకునేందుకు ముందుకొచ్చారు
ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే సినీ అభిమానులు, పరిశ్రమకు చెందిన ప్రముఖులు రామచంద్రను ఆదుకోవాలని ముందుకు వస్తున్నారు. ఇప్పటికే చాలామంది ఆయన కోసం సహాయం చేయాలన్న సంకల్పంతో స్పందిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో మంచు మనోజ్ రామచంద్రను ప్రత్యక్షంగా కలసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని, వైద్య ఖర్చుల కోసం సహాయం అందించేందుకు తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
తాజాగా మనం సైతం ఫౌండేషన్ నిర్వాహకులు, టాలీవుడ్ ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ (Kadambari Kiran),రామ చంద్రను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. రామచంద్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న కిరణ్ రామచంద్రను హైదరాబాద్‌లోని అఅతని నివాసంలో కలిశారు. వైద్య ఖర్చుల కోసం రూ.25 వేల ఆర్థిక సాయాన్ని చెక్ రూపంలో అందించారు. ఈ సందర్భంగా రామచంద్రకు ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు.
కొన్నేళ్ల క్రితం రామ చంద్ర
రామ చంద్ర సుమారు 100కు పైగా సినిమాల్లో నటించాడు. వెంకీ, ఆనందం, సొంతం, కింగ్, దుబాయి శీను, లౌక్యం వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో తన కామెడీతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. ఎక్కువగా హీరో ఫ్రెండ్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. అయితే కొన్నేళ్ల క్రితం రామ చంద్ర ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచే సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. దీనికి తోడు పెరాలసిస్ సోకడంతో ఇప్పుడు పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. అయితే తనలో ఇంకా నటించే సామర్థ్యం ఉందని, తనకు సినిమా అవకాశాలు కల్పించాలని రామ చంద్ర కోరుతున్నాడు.
Read hindi news : hindi.vaartha.com
Read also: