📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Spirit Movie మళ్లీ వాయిదా పడ్డ స్పిరిట్ సినిమా షూటింగ్

Author Icon By Anusha
Updated: August 28, 2025 • 1:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి 2898 AD బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ సాధించగా, ఆ విజయానంతరం ఆయనపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం ఆయన ది రాజా సాబ్, ఫౌజీ సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు వేర్వేరు జానర్లలో తెరకెక్కుతుండటంతో ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ది రాజా సాబ్ డిసెంబర్ 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఆలస్యాల కారణంగా ఆ సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు ప్రభాస్ మరో సినిమా ఫౌజీ కూడా వచ్చే ఏడాది థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక అందరి దృష్టికేంద్రీకృతమవుతున్న సినిమా స్పిరిట్ (Spirit Movie). ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్ అనిమల్ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రభాస్ కెరీర్‌లో ఎన్నో రకాల పాత్రలు చేసినా, శక్తివంతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయనను అభిమానులు చూడలేదు.

కీలక పాత్రల్లో

ఈ సినిమాతో ఆ కోరిక నెరవేరనుంది. ప్రభాస్ శక్తివంతమైన, పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనుండటంతో ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.ఇక విలన్ పాత్రలో కొరియన్ స్టార్ డాన్ లీ నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది నిజమైతే స్పిరిట్కు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాలో నటుడు తరుణ్, నటి మడోన్నా సెబాస్టియన్, సీనియర్ నటుడు శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటించబోతున్నారని సమాచారం. ప్రభాస్ తండ్రి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి కనిపించనున్నారని కూడా రూమర్స్ వస్తున్నాయి. అయితే దీనిపై మేకర్స్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.ఇక స్పిరిట్ షూటింగ్ (Spirit Shooting) ఎప్పుడో మొదలవ్వాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. సందీప్ రెడ్డి వంగా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, సెప్టెంబర్ రెండో వారం నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుందని తొలుత ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆ పని అక్టోబర్‌కి షిఫ్ట్ అయింది. తాజాగా లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ డిసెంబర్‌కి వాయిదాపడ్డదంట.

Latest News

కొన్ని సీన్లు

అయితే ఎప్పుడో మొదలు కావాల్సిన ఈ సినిమా షూటింగ్ పదే పదే వాయిదా పడుతుండటంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.‘స్పిరిట్’ మూవీలో ముందుగా దీపికా పదుకొణెని హీరోయిన్‌గా తీసుకోగా కొన్ని కారణాల చేత ఆమెను తప్పించారు. తర్వాత ‘యానిమల్’ బ్యూటీ త్రిప్తి దిమ్రిని తీసుకున్నారు. ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజా సాబ్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి మారుతి కొన్ని సీన్లు రీషూట్ చేస్తుండటంతో ప్రభాస్ మళ్లీ డేట్స్ కేటాయించాల్సి వచ్చిందట. మరోవైపు తను ‘ఫౌజీ’ షూటింగులోనూ పాల్గొంటున్నాడు. ఈ రెండు సినిమాల కారణంగా ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీకి డేట్స్ కేటాయించలేకపోతున్నాడని, అందుకే డిసెంబర్ వరకు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.

Read hindi news: https://hindi.vaartha.com/

Read Also:

https://vaartha.com/latest-news-actress-lakshmi-menon-approaches-kerala-high-court-for-anticipatory-bail/crime/536930/

Fauji movie Kalki 2 Korean actor Don Lee Prabhas movies Prabhas police role salaar 2 Sandeep Reddy Vanga Spirit Movie The Raja Saab

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.