📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం

Latest News: Rukmini Vasant ఎన్టీఆర్ తో నటించనున్న రుక్మిణి వసంత్

Author Icon By Anusha
Updated: September 1, 2025 • 1:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇప్పుడు తెలుగు, తమిళ, హిందీ సహా అన్ని భాషల్లోనూ పాన్‌ ఇండియా స్థాయిలో కన్నడ భామల హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు రష్మిక మందానా వరుస బ్లాక్‌బస్టర్ సినిమాలతో దూసుకుపోతుంటే, మరోవైపు నభా నటేష్‌, శ్రద్ధా శ్రీనాథ్ లాంటి యాక్ట్రెస్‌లు మాత్రం కాస్త వెనుకబడ్డారు. ఆషిక రంగనాథ్ కూడా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చినా, ఆశించిన విజయాలు అందుకోలేకపోయింది. ఆమె తన ఆశలన్నీ ప్రస్తుతం “విశ్వంభర” సినిమాపైనే పెట్టుకుంది. ఇలాంటి పోటీ వాతావరణంలో కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ (Rukmini Vasant) తన ప్రత్యేకమైన నటనతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షిస్తోంది.2019లో వచ్చిన బీర్బల్ సినిమాతో కన్నడలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రుక్మిణీకి మొదట్లో పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ 2023లో విడుదలైన క్లాసిక్ లవ్‌స్టోరీ సప్త సాగరాలు దాటి (Side A & Side B) సినిమాలు ఆమె కెరీర్‌కు గేమ్ ఛేంజర్‌గా మారాయి. ఈ చిత్రంలో ఆమె పోషించిన పాత్రలోని అమాయకత్వం, ఎమోషనల్ లోతు, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

సప్త సాగరాలు దాటి వల్ల నా జీవితం పూర్తిగా మారిపోయింది

విమర్శకుల ప్రశంసలతో పాటు, అభిమానుల అభిమానాన్ని సొంతం చేసుకున్న రుక్మిణీ, ఆ సినిమా తన జీవితాన్నే మార్చేసిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. “ఈ సినిమా నాకు రెండో జీవితాన్ని ఇచ్చింది. ఒక దశలో నేను నటిగా సక్సెస్ అవుతానా లేదా అనే సందేహం కలిగింది. కానీ సప్త సాగరాలు దాటి వల్ల నా జీవితం పూర్తిగా మారిపోయింది” అని ఆమె చెప్పింది.రుక్మిణీ వసంత్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం ఉన్న నటి. నిఖిల్ సరసన నటించిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా (Apudo Epudo movie) తో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయినప్పటికీ రుక్మిణీపై వచ్చిన ప్రతికూల ప్రభావం ఎక్కువ కాలం నిలవలేదు. ఎందుకంటే ఆమె నటనపై ఉన్న నమ్మకమే కాదు, సహజమైన అందం, ముద్దుగుమ్మలాగా కనిపించే స్క్రీన్ లుక్ వల్ల కొత్త అవకాశాలు వరుసగా వస్తూనే ఉన్నాయి.ఇప్పుడు ఈ భామ కెరీర్‌లో భారీ మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ డ్రాగన్లో హీరోయిన్‌గా రుక్మిణీ వసంత్‌ను ఎంపిక చేశారు.

ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఎన్వీ ప్ర‌సాద్

కొంతకాలంగా ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారగా, తాజాగా మద్రాసి చిత్ర నిర్మాత ఎన్వీ ప్రసాద్ అధికారికంగా ఈ వార్తను ధృవీకరించారు. దీంతో రుక్మిణీ వసంత్ ఇప్పుడు పాన్‌ ఇండియా స్థాయిలో మరింత హైలైట్ అవుతోంది.సెప్టెంబ‌ర్ 5న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఎన్వీ ప్ర‌సాద్ ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు. ఈ చిత్రానికి ఆమె రూ. 1.5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటోందన్న టాక్ ఫిలింనగర్‌లో గట్టిగా వినిపిస్తోంది. ఆమె యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉండ‌డం, ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతుండ‌డంతో, ఆమె అడిగినంత రెమ్యునరేషన్‌కు మేకర్స్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. కాగా, తమిళ స్టార్ శివకార్తికేయన్ సరసన ‘మదరాసి’ అనే చిత్రంలో నటించిన రుక్మిణీ, కాంతార 2 చిత్రంలో కూడా న‌టిస్తుంది. అలానే టాక్సిక్‌లోను ఈ ముద్దుగుమ్మ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. చూస్తుంటే రానున్న రోజుల‌లో ఈ ముద్దుగుమ్మ హ‌వా ఓ రేంజ్‌లో ఉండ‌నుంద‌ని అర్ధ‌మ‌వుతుంది.

రుక్మిణి వసంత్ కెరీర్ ఎప్పుడు ప్రారంభమైంది?

2019లో విడుదలైన Birbal Trilogy (Kannada) సినిమాతో రుక్మిణి వసంత్ సినీ ప్రయాణం ప్రారంభమైంది.

రుక్మిణి వసంత్‌కి బిగ్ బ్రేక్ ఇచ్చిన సినిమా ఏది?

2023లో విడుదలైన కన్నడ బ్లాక్‌బస్టర్ Sapta Sagaradaache Ello (Side A & Side B) సినిమాతో రుక్మిణి వసంత్ కి అపారమైన గుర్తింపు వచ్చింది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/latest-news-kottha-loka-cinema-is-a-new-movie-that-is-pouring-in-box-office-collections/cinema/539348/

Ashika Ranganath Breaking News Kannada Actress latest news Nabha Natesh Rashmika Mandanna Rukmini Vasanth Sapta Sagaradaache Ello Shraddha Srinath Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.