📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

Latest News: Rashmika Mandanna కాంచన 4 లో నటించనున్న రష్మిక మందానా?

Author Icon By Anusha
Updated: August 31, 2025 • 1:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కన్నడ బ్యూటీ రష్మిక మందానా (Rashmika Mandanna) సినీ ప్రస్థానం శాండల్‌వుడ్‌ ద్వారా ప్రారంభించుకొని, టాలీవుడ్‌లో తన ప్రతిభను ప్రదర్శించి, తర్వాత బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు పొందింది. రష్మిక తన అందం, నటన, క్రమం తప్పని శ్రమతో మూడు భాషల ఇండస్ట్రీలలో తన ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఆమె కెరీర్‌లో ముఖ్యంగా యానిమల్, పుష్ప 2, ఛావా, కుబేర వంటి చిత్రాలు బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచాయి.ఇప్పటివరకు వచ్చిన విజయాల అనంతరం రష్మిక త్వరలోనే ‘థామా’ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీపావళికి విడుదల కావాల్సిన ఈ చిత్రం, యాక్షన్-హారర్ లవ్‌స్టోరీగా రూపొందుతోంది. ఇందులో హీరోగా స్టార్ ఆయుష్మాన్ ఖురానా నటిస్తున్నాడు. అక్టోబర్ 21న విడుదల కానున్న ఈ చిత్రం కోసం రష్మిక ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా, ఆడియన్స్ ప్రత్యేకంగా ఆకర్షితులయ్యారు. ఫస్ట్ లుక్‌లో రష్మిక తడక అనే పాత్రలో చూపించబడింది.

ఈ మూవీలో సీనియర్ నటుడు

రష్మిక మరో చిత్రం ‘మైసా’లో యోధురాలిగా నటిస్తోంది. ఇందులో రక్తంతో తడిసిన మొహంతో కత్తి పట్టుకుని యాక్షన్ అవతార్‌లో కనిపిస్తోంది. ప్రస్తుతం రష్మిక నటించిన తెలుగు సినిమా ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ కూడా విడుదలకు సిద్ధంగానే ఉంది.తాజాగా రష్మిక మందానా మరో హారర్ మూవీలో నటించనున్నట్లు తెలుస్తోంది. రాఘవ లారెన్స్ (Raghava Lawrence) హీరోగా నటిస్తూ తానే స్వయంగా దర్శకత్వం వహిస్తోన్న ‘కాంచన’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఫస్ట్ మూవీ ‘ముని’లో లారెన్స్ సరసన వేదిక నటించగా , సెకండ్ మూవీ ‘కాంచన’లో లక్ష్మీరాయ్ అందాలు ఆరబోసింది. ఈ మూవీలో సీనియర్ నటుడు శరత్‌కుమార్ హిజ్రాగా నటించడం విశేషం. ఆ తర్వాత లారెన్స్, నిత్యా మీనన్, తాప్సి కలిసి కాంచన 2(తెలుగులో ‘గంగ’)లో నటించారు. ఆ తర్వాత 2019లో ‘కాంచన 3’తో మరో హిట్ అందుకున్నాడు లారెన్స్. ఈ మూవీలో వేదిక, ఓవియా, నిక్కీ తంబోలి, రష్యా నటి రి జావి అలెగ్జాండ్రా కీలక పాత్రల్లో నటించగా లారెన్స్ ద్విపాత్రాభినయం చేశాడు. ప్రస్తుతం రాఘవ లారెన్స్ తన తమ్ముడు ఎల్విన్‌తో కలిసి ‘బుల్లెట్టు బండి’ అనే మూవీలో నటిస్తున్నాడు.

Latest News

ప్రత్యేక పాత్ర

మిస్టరీ, క్రైమ్, యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి తమిళ చిత్రం డైరీ ఫేం దర్శకుడు ఇన్నాసి పాండియన్ దర్శకత్వం వహిస్తున్నారు.‘కాంచన’ సిరీస్‌ సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన రాఘవ లారెన్స్‌.. ప్రస్తుతం ‘ కాంచన 4 ’ మూవీ తీసే పనిలో ఉన్నారు. ఇందులోనూ ఆయనే హీరో కాగా.. పూజా హెగ్దే, నోరా ఫతేహి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో రష్మిక మందానా కూడా ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై చర్చలు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ‘కాంచన’ సిరీస్ చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తన చిత్రాలతో లారెన్స్ ఎంతగా భయపెడతాడో.. హీరోయిన్ల గ్లామర్‌పై అంతకుమించి ఫోకస్ పెడతాడు. ‘కాంచన 4’లో రష్మికని ఏ మేరకు వినియోగించుకుంటాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/coolie-movie-ott-release-date-amazon-prime/cinema/538850/

rashmika mandanna blockbuster hits rashmika mandanna bollywood rashmika mandanna movies rashmika mandanna tollywood

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.