📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Paradha Movie పరదా మూవీ రివ్యూ

Author Icon By Anusha
Updated: August 22, 2025 • 4:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అనుపమా పరమేశ్వరన్ ప్రేక్షకులకు మదిలో ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది. ఆమె ఇప్పటివరకు చేసిన పాత్రల్లో సంప్రదాయబద్ధమైన, సాఫ్ట్ లుక్స్ ఉన్న రోల్స్‌లోనూ, మరోవైపు స్టైలిష్, మోడ్రన్ గెటప్‌లలోనూ తనదైన నటనతో ఆకట్టుకుంది. కెరీర్ ప్రారంభం నుండి ఆమె ఎంచుకునే కథలు ఎక్కువగా నాయికకు ప్రాధాన్యం ఉన్నవే కావడం విశేషం. అలాంటి అనుపమ తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన చిత్రం ‘పరదా’ (Paradha Movie). ఈ సినిమాతో ఆమె మరోసారి తనదైన నటనకు గౌరవం తెచ్చుకుంది.నాయికా ప్రధానమైన కంటెంట్ తో చేసిన మరో సినిమా ఇది. విలేజ్ నేపథ్యంలో నడిచే కథ ఇది. ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్స్ లోకి వచ్చింది.

కథా నేపథ్యం

‘పడతి’ అనే ఒక విలేజ్. అక్కడ సుబ్బులక్ష్మి (అనుపమా పరమేశ్వరన్) కూడా తన తండ్రితో కలిసి నివసిస్తూ ఉంటుంది. బాల్యంలోనే తల్లిని కోల్పోయిన దురదృష్టవంతురాలు ఆమె. ఆ ఊళ్లోని వాళ్లందరికీ ఇలవేల్పు ‘జ్వాలమ్మ తల్లి’. ఆ గ్రామంలో ఈడొచ్చిన అమ్మాయిలంతా, ముఖం కనిపించకుండా ‘పరదా’ ధరించాలి. ఒకవేళ పరదా లేకుండా ఎవరికైనా కనిపిస్తే, అది అమ్మవారికి ఆగ్రహాన్ని కలిగిస్తుంది. గర్భవతులుగా ఉన్న స్త్రీలకు .. కడుపులో ఉన్న బిడ్డకు ప్రాణహాని అనే నమ్మకం అక్కడివారిలో బలంగా ఉంటుంది. ఇక ఎవరైతే పరదా నియమాన్ని ఉల్లంఘించారో, వాళ్లు తమంతట తాముగా గ్రామస్తుల సమక్షంలో బావిలోకి దూకి ఆత్మర్పణ చేయవలసి ఉంటుంది. అలా చేసినవారి సమాధులు కూడా ఆ గ్రామంలో చాలానే ఉంటాయి. ఇలాంటి పరిస్థితులలో సుబ్బు అదే గ్రామానికి చెందిన రాజేశ్ (Rajesh) అనే యువకుడిని ప్రేమిస్తుంది. అతనినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. పెద్దలు కూడా అందుకు అంగీకరిస్తారు. నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఇంత జరుగుతున్నా అతని దగ్గర కూడా ఆమె పరదా తీయదు.

Latest News

విశేషణ

నిశ్చితార్థం రోజు రానే వస్తుంది. సుబ్బు స్నేహితురాలైన రత్న ( సంగీత) కూడా సిటీ నుంచి ఆ ఫంక్షన్ కి వస్తుంది. ఆ సమయంలోనే ఒక ఇంగ్లిష్ మేగజైన్ కవర్ పేజీపై సుబ్బు ఫొటో వస్తుంది. అది చూసి ఊళ్లోవాళ్లంతా ఆశ్చర్యపోతారు. ఆ క్షణంలోనే నిశ్చితార్థాన్ని రద్దు చేస్తారు. ఆ ఫోటొ ఎవరు తీశారో తనకి తెలియదనీ, అందులో తన ప్రమేయం లేదని సుబ్బు చెబుతుంది. ఆ విషయాన్ని నిరూపించుకోమనీ, లేదంటే ఆత్మార్పణకి సిద్ధం కావాలని పెద్దమనుషులు తీర్పు చెబుతారు. తాను తప్పు చేయలేదని నిరూపించుకోవడం కోసం సుబ్బు ఏం చేస్తుంది? ఆ ప్రయత్నంలో ఆమెకి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? అనేది కథ.  ఒక గ్రామంలో అమ్మవారితో ముడిపడిన ఒక ఆచారం. ఆ ఆచారాన్ని అన్నివేళలా పాటిస్తూ వస్తున్న యువతికే ఆ ఊరు ఒక పరీక్ష పెడుతుంది. ఆ పరీక్షలో తాను గెలవకపోతే అందుకు ప్రతిగా తన ప్రాణాలనే చెల్లించే పరిస్థితి. అప్పుడు ఆ యువతి ఏం చేస్తుంది? అనే అంశం చుట్టూ దర్శకుడు ఈ కథను తయారు చేసుకున్నాడు. అయితే తాను అనుకున్న కథను తెరపై ఆసక్తికరంగా ఆవిష్కరించడంలో మాత్రం బాగానే తడబడ్డాడు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/sony-liv-original-four-and-a-half-gang-trailer-released/cinema/534526/

Anupama Parameswaran Breaking News latest news Parada movie Praveen Kandregula Telugu cinema Telugu News village backdrop film

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.