📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

Latest News: Manchu Manoj – మిరాయ్ ట్రైలర్‌ చూసి రజినీకాంత్ మెచ్చుకున్నారు

Author Icon By Anusha
Updated: September 5, 2025 • 12:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న మంచు మనోజ్ (Manchu Manoj) మళ్లీ సినిమాల పట్ల దృష్టి పెట్టి వరుస ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవలి కాలంలో భైరవంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన, ఇప్పుడు భారీ అంచనాల మధ్య రూపొందిన ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం మిరాయ్లో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. తేజా సజ్జా హీరోగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రంలో తేజా సజ్జాతో పాటు రితికా నాయక్ హీరోయిన్‌గా నటించగా, శ్రియా చరణ్, జగపతిబాబు, జయరామ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రత్యేకత ఏమిటంటే మంచు మనోజ్ ఇందులో ఓ విభిన్నమైన, శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. తాజా ఇంటర్వ్యూలో మంచు మనోజ్ మాట్లాడుతూ.. ఈ పాత్రను ఆధునిక రావణాసురుడి వలె డిజైన్ చేశారని ఆయన స్వయంగా చెబుతున్నారు. అయితే ఇందులో ఆడవాళ్ల జోలికి వెళ్లే రావణాసురుడి ఇమేజ్‌ను చూపించకుండా, సీత రాకముందు ఆయన ఎలా ఉండేవాడో అలాంటి గంభీరమైన రూపాన్ని ఆవిష్కరించారని స్పష్టం చేశారు.

Latest News

మంచి పాత్రలు చేసుకుంటూ ముందుకెళ్లు అని ఆశీర్వదించారు

శక్తి ఉన్నవాడికే స్థానం దక్కాలి, కష్టపడే వాడికి ఈ ప్రపంచంలో చోటు ఉండకూడదు అనే స్ట్రాంగ్ పాయింట్‌తో మూవీ సాగుతుంది. ఈ పాత్ర చేయడానికి వెళ్లే ముందు దేవుడికి దండం పెట్టి ఆంజనేయుడికి క్షమాపణ చెప్పాను. ఈ ట్రైలర్‌ చూసి రజినీకాంత్ (Rajinikanth) మెచ్చుకున్నారు. ఇలాగే మంచి పాత్రలు చేసుకుంటూ ముందుకెళ్లు అని ఆశీర్వదించారు. ఇకనుంచి గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేయాలని సూచించారు. నేను గతంలో సినిమాలు చేయనప్పుడే రజినీ అంకుల్ నాకు గట్టిగా క్లాస్ పీకారు. సినిమాలు చేయకుండా ఏం చేస్తున్నావని నాపై అరిచారు.’ అని చెప్పుకొచ్చారు మంచు మనోజ్.

ఈ సినిమాలో తేజ చేతిలోని ‘మిరాయ్’ అస్త్రానికి ఓ చరిత్ర ఉన్నట్లే.. నా ఖడ్గానికీ ఓ ప్రత్యేకత ఉంటుంది. అది మాయమైపోయి మళ్లీ వస్తుంటుంది. దానికి ఆ లక్షణం ఉండటానికి కారణం ఏంటన్నది ఆసక్తికరంగా ఉంటుంది’ అని తెలిపారు మనోజ్. ప్రస్తుతం నేను ‘డేవిడ్‌ రెడ్డి’, ‘రక్షక్‌’ అనే చిత్రాల్లో నటిస్తున్నాను. అలాగే ‘అత్తరు సాయిబు’ అనే ఓ కథ అనుకున్నాం.. త్వరలోనే దానిపై అప్‌డేట్ వస్తుంది.

మంచు మనోజ్ తొలి సినిమా ఏది?

బాల నటుడిగా ఆయన మేజర్ చంద్రకాంత్ (1993) సినిమాలో నటించారు. హీరోగా మొదటి సినిమా దొంగలాట (2004).

ఆయన నటించిన ప్రముఖ చిత్రాలు ఏవి?

బిందాస్, వేడు, పొటుగాడు, కరెంటు, ఉస్థాద్, మిస్టర్ నూకయ్య వంటి సినిమాల్లో నటించారు. ఆయన నటనలో ఉత్సాహం, ఎనర్జీ ఎక్కువగా ఉంటుందని ప్రేక్షకులు చెప్పుకుంటారు.

Read hindi news : hindi.vaartha.com

Read also:

https://vaartha.com/latest-news-little-hearts-movie-little-hearts-movie-review/cinema/541544/

Bhairavam Breaking News Jagapathi Babu karthik ghattamaneni latest news Manchu Manoj Mirai Movie People media factory ritika naik Shriya Saran Teja Sajja Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.