భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT ప్లాట్‌ఫారమ్‌గా పేరు పొందిన ZEE 5 2025లో సూపర్‌హిట్ సినిమాలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో ప్రతి నెలా వివిధ భాషల్లో బ్లాక్‌బస్టర్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, ఒరిజినల్ కంటెంట్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విభిన్నమైన కంటెంట్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ అన్ని వర్గాల అభిమానులను ఆకట్టుకుంటోంది.ఇప్పటికే అనేక విజయవంతమైన సినిమాలు ZEE 5లో స్ట్రీమింగ్ అవుతూ ఉండగా, తాజాగా మరో అద్భుతమైన కుటుంబ కథా చిత్రం ‘మామన్’ (Maman)ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఆగస్టు 8న తమిళ భాషలో ఈ సినిమా ZEE 5లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. తమిళ ఆడియెన్స్ నుండి మంచి స్పందన లభించడంతో, ఇప్పుడు ఈ చిత్రాన్ని ఆగస్టు 27 నుంచి తెలుగు, కన్నడ భాషల్లో కూడా స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
కథేంటంటే
ఇన్‌బా(సూరి) చెల్లెలు గిరిజ (శ్వాసిక)కకు పెళ్లై పదేళ్లైనా పిల్లలు పుట్టారు. గిరిజ మొక్కని దేవుడు లేడు. చివరకు ఆమె ఓ బాబుకి జన్మనిస్తుంది. లేక లేక పుట్టిన మేనల్లుడు నిలన్ (ప్రగీత్ శివన్) అంటే ఇన్‌బాకు అమితమైన ప్రేమ. తనను ప్రేమగా లడ్డు అని పిలుచుకుంటుంటాడు. ఇన్‌బా, రేఖను పెళ్లి చేసుకుంటాడు. లడ్డుకి మామ అంటే ఉండే ప్రేమతో అతనితోనే ఉంటాడు. ఇది రేఖకు నచ్చదు. దీంతో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంది. చివరకు లడ్డు వల్ల ఇన్‌బా, రేఖ విడిపోతారా? ఇన్‌బాపై నిలన్‌కు ఉన్న ప్రేమను రేఖ అర్థం చేసుకుంటుందా? అనే విషయాలను తెలుసుకోవాలంటే మాత్రం జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న ‘మామన్’ సినిమాను చూడాల్సిందే.
Read hindi news: https://hindi.vaartha.com/
Read Also: