📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Kottha Loka cinema వసూళ్ల వర్షం కురిపిస్తోన్న కొత్త లోక సినిమా

Author Icon By Anusha
Updated: September 1, 2025 • 12:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మలయాళ దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజ్జి దంపతుల కూతురు కళ్యాణి ప్రియదర్శన్ తెలుగు తెరపై అఖిల్ అక్కినేని సరసన నటించిన హలో (2017) సినిమాతో పరిచయమైంది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నా, ఆ తర్వాత అవకాశాలను సద్వినియోగం చేసుకునే స్థాయిలో విజయాలు సాధించలేకపోయింది. చిత్రలహరి (సాయిధరమ్ తేజ్ సరసన), రణరంగం (శర్వానంద్ తో) వంటి సినిమాల్లో నటించినా అవి బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాలు సాధించలేదు. ఫలితంగా తెలుగు, తమిళ సినిమాల్లో పెద్దగా అడుగుపెట్టలేక, తన మాతృభాష మలయాళంలోనే కెరీర్‌ను కొనసాగించింది.మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూ మంచి స్థానం సంపాదించుకున్న కళ్యాణి, ఇప్పుడు కొత్త ప్రయోగం చేసింది. సూపర్ ఉమెన్‌గా కొత్త లోక చాప్టర్ 1 (New World Chapter 1) చిత్రంలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాను ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ నిర్మించగా, అరుణ్ దర్శకత్వం వహించారు.

తెలుగులోనూ తొలిరోజు

“కొత్త లోక సినిమాటిక్ యూనివర్స్”లో తొలి చిత్రంగా రూపొందిన ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే, ఇది ఇండియాలోనే మొట్టమొదటి మహిళా సూపర్ హీరో మూవీ (Female superhero movie) గా నిలిచింది.‘ఓనం’ కానుకగా విడుదలైన ఈ చిత్రం అక్కడ సంచలనంగా మారింది. సూపర్ ఉమెన్‌గా కళ్యాణి ప్రియదర్శన్ ఇరగదీసిందని అంటున్నారు. గతంలో ‘ఆంటోనీ’ చిత్రంలో బాక్సర్‌గా కనిపించిన కళ్యాణి.. ఇందులో అద్బుత శక్తులు కలిగిన మహిళగా అదరగొట్టేసింది. టాక్‌కి తగినట్లుగానే ‘కొత్త లోక’ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మలయాళంలో తొలి మూడు రోజులకు గాను రూ.42 కోట్ల గ్రాస్ రాబట్టింది. అటు తెలుగులోనూ తొలిరోజు రూ.1.42 కోట్ల గ్రాస్ రాబట్టి సూపర్‌హిట్‌ దిశగా వెళుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ అదిరిపోయే రెస్పాన్స్ కనబరుస్తుండటంతో రాబోయే రోజుల్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘ఓనం’ కానుకగా రిలీజైన మోహన్‌లాల్ ‘హృదయపూర్వం’ చిత్రానికి కూడా హిట్ టాక్ వచ్చినా ‘కొత్త లోక’పై పెద్దగా ప్రభావం చూపించడం లేదు. ఆదివారం రాత్రి కేరళలో 300 షోలు అదనంగా పడ్డాయంటే ఈ చిత్రానికి వస్తోన్న ఆదరణ ఏంటో తెలుస్తోంది.

Latest News

రెండో భాగంలో ఊహించని మలుపులతో

ఈ మూవీలో కల్యాణి ప్రియదర్శన్ ‘చంద్ర’ పాత్రలో ఒదిగిపోయింది. సాధారణ కమర్షియల్ పాత్రలకు భిన్నంగా, ఫైట్స్ చేసి తనలోని మరో కోణాన్ని చూపించింది. హావభావాలను పలికించిన తీరు, ఎమోషన్స్‌, యాక్షన్స్ సీన్స్‌లో అద్భుతంగా చేసింది. ఇక అమాయకమైన ప్రేమలో పడే కుర్రాడిగా నస్లేన్ పాత్ర కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ , సౌబిన్ షాహిర్ అతిథి పాత్రల్లో కనిపించడం మరో విశేషం. ఫస్టాఫ్‌లో సినిమా కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ, రెండో భాగంలో ఊహించని మలుపులతో ఆసక్తిని రేకెత్తించింది. మలయాళ స్టార్ హీరో ప్రియదర్శన్, హీరోయిన్ లిస్సీ దంపతుల కుమార్తె అయిన కళ్యాణ్ ప్రియదర్శన్ న్యూయార్క్‌లో ఆర్కిటెక్చర్ డిగ్రీ చేసింది. నటనపై ఆసక్తితో తన డిగ్రీని పక్కనబెట్టి యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన జర్నీని మొదలుపెట్టి ఇప్పుడు ఏకంగా సూపర్ హీరోయిన్‌గా మారిపోయింది.

కళ్యాణి ప్రియదర్శన్ సినీ కెరీర్ ఎప్పుడు ప్రారంభమైంది?

2017లో హలో చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది.

ఆమె తండ్రి ఎవరు?

ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్, తల్లి లిజ్జి (నటి).

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-movie-when-is-the-release-date-of-ice-age-animation-movie-6/cinema/539300/

Breaking News hello movie kalyani priyadarshan kotta loka chapter 1 latest news Malayalam movies saitej chithralahari sharwanand ranarangam superwoman movie Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.