యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas), సౌందర్యభరిత నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ థ్రిల్లర్ “కిష్కింధపురి” విడుదలకు సిద్ధమవుతోంది. వినూత్నమైన టైటిల్‌తోనే ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రం తాజాగా ట్రైలర్ విడుదలతో మరింత హైప్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
ట్రైలర్
తాజాగా విడుదలైన కిష్కింధపురి మూవీ (Kishkindhapuri Movie) ట్రైలర్‌లో ఉత్కంఠ, భయం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సమపాళ్లలో ఉండటంతో ప్రేక్షకులు మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. భయానక వాతావరణం, మిస్టీరియస్ లొకేషన్స్, టెన్షన్ క్రియేట్ చేసే సన్నివేశాలు ట్రైలర్‌లో ప్రధాన హైలైట్‌గా నిలిచాయి. ముఖ్యంగా చివరి నిమిషాల్లో అనుపమ పరమేశ్వరన్ కనిపించిన హారర్ లుక్, ఆమె డైలాగ్ డెలివరీ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన పవర్‌ఫుల్ యాక్షన్, ఎమోషనల్ నటనతో మరోసారి అభిమానులను ఆకట్టుకోనున్నాడని ఈ ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: