📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే..

Latest News: Karishma Kapoor – తన తండ్రి ఆస్తిలో వాటా కావాలని కోర్టుకెక్కిన కరిష్మా కపూర్ పిల్లలు

Author Icon By Anusha
Updated: September 9, 2025 • 7:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దివంగత వ్యాపారవేత్త సంజయ్ కపూర్ ఆస్తి వ్యవహారం మరోసారి హైకోర్టు దాకా వెళ్లింది. ఆయనకు చెందిన సుమారు రూ.30,000 కోట్ల విలువైన ఆస్తి కోసం కుటుంబ సభ్యుల మధ్య పెద్ద ఎత్తున వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసు కొత్త మలుపు తిరిగింది.

సంజయ్ కపూర్ మొదటి భార్య బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ (Karishma Kapoor). ఈ దాంపత్య జీవితం చాలా కాలం నిలవకపోయినా, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వారే తమ హక్కుల కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తమ తండ్రి సంపాదించిన ఆస్తిలో తనకు సరైన వాటా దక్కాలని కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ దాఖలు కావడంతో కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

వీలునామా సృష్టించిందని ఇందులో ఆరోపించారు

పిల్లల తరఫున సమర్పించిన పిటిషన్‌లోసంజయ్ కపూర్ మూడవ భార్య అయిన ప్రియా కపూర్ తమకి ఆస్తి దక్కకుండా చేస్తుందని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు ప్రియా కపూర్ తప్పుడు వీలునామా సృష్టించిందని ఇందులో ఆరోపించారు. ఆస్తి మొత్తాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని ఆమె కుట్ర చేస్తున్నట్లు పిటిషన్‌లో ప్రస్తావించారు.కరిష్మా కపూర్, సంజయ్ కపూర్ 2003లో వివాహం చేసుకొని 2016 వరకు అంటే 13 సంవత్సరాలు పాటు వివాహ బంధంలో ఉన్నారు. ఆ తర్వాత ఈ జంట విడాకులు తీసుకుంది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

Latest News

ఈ వివాదానికి ముఖ్య కారణం

సంజయ్ కపూర్ (Sanjay Kapoor) యునైటెడ్ కింగ్‌డమ్‌లో హఠాత్తుగా మరణించిన తర్వాత తమకి ఆస్తి దక్కకుండా ప్రియ కపూర్ అన్యాయం చేసినట్లు వీళ్లు ఆరోపించారు.ఈ కేసులో ప్రియా కపూర్, ఆమె కుమారుడు, సంజయ్ కపూర్ తల్లి రాణి కపూర్‌ని ప్రతివాదులుగా చేర్చారు. వీలునామాను అమలు చేసే వ్యక్తి శ్రద్ధా సూరి మార్వా కూడా ప్రతివాదిగా ఉన్నారు. ఈ వివాదానికి ముఖ్య కారణం 2025 మార్చి 21న రాసి ఒక వీలునామా. దీని ప్రకారం సంజయ్ కపూర్ తన వ్యక్తిగత ఆస్తి మొత్తాన్ని ప్రియా కపూర్‌కు రాసిచ్చినట్లు ఉంది.

ఏడు వారాల తర్వాత

తమ సవతి తల్లి ప్రియా కపూర్ ఇద్దరు వ్యక్తులతో కలిసి ఈ కుట్ర చేసిందని కరిష్మా కపూర్ పిల్లలు ఆరోపిస్తున్నారు. దినేష్ అగర్వాల్, నితిన్ శర్మ అనే ఇద్దరు వ్యక్తులతో కలిసి వీలునామాను దాచిపెట్టిందని చెబుతున్నారు. ఏడు వారాల తర్వాత జూలై 30, 2025న ఫ్యామిలీ అందరి ముందు ఈ వీలునామా గురించి చెప్పారని అంటున్నారు.ఈ వీలునామా నకిలీదని అందుకే తమకి కనీసం దాని కాపీ కూడా ఇవ్వలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రియా కపూర్ ప్రవర్తన చూస్తుంటే సంజయ్ కపూర్ ఆస్తి మొత్తాన్ని తానే దక్కించుకోవాలని చూస్తున్నట్లు ఉందని ఆరోపించారు. మిగిలిన వారసులకు ఆస్తి రాకుండా పెద్ద కుట్ర జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

విషయం పరిష్కారమయ్యే వరకు సంజయ్ కపూర్

కనుక తమను చట్టపరంగా వారసులుగా గుర్తించాలని పిల్లలు కోర్టును కోరారు. తమ తండ్రికి చెందిన ప్రతి ఆస్తిలోనూ ఐదు వంతుల్లో ఒక వంతు తమకి వాటా ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ విషయం పరిష్కారమయ్యే వరకు సంజయ్ కపూర్ వ్యక్తిగత ఆస్తులను ఫ్రీజ్ చేయాలని కోర్టును కోరారు.ఇదంతా చూస్తుంటే సంజయ్ కపూర్ మరణం తర్వాత ఆయన ఆస్తి కోసం కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయని అర్థమవుతోంది. పిల్లలు తమ వాటా కోసం కోర్టును ఆశ్రయించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. మరి కోర్టు ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాలి.

కరిష్మా కపూర్ జన్మతేది ఎప్పుడు?

ఆమె 1974 జూన్ 25న ముంబైలో జన్మించింది.

కరిష్మా కపూర్ కుటుంబ నేపథ్యం ఏమిటి?

కపూర్ కుటుంబానికి చెందిన ఆమె తండ్రి రంధీర్ కపూర్, తల్లి బబిత. కరీనా కపూర్ ఆమె సోదరి.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/latest-news-nani-nanis-tweet-on-the-movie-little-hearts/cinema/544165/

30000 crore assets Breaking News Delhi High Court case inheritance battle Karisma Kapoor children latest news Priya Kapoor will controversy Sanjay Kapoor property dispute Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.