📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం

Latest News: Ilayaraja -గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ పై హైకోర్టులో కేసు వేసిన ఇళయరాజా

Author Icon By Anusha
Updated: September 6, 2025 • 11:07 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతీయ సినీ సంగీత చరిత్రలో ఇళయరాజా పేరు ఒక మైలురాయి. ఆయన రాసిన స్వరాలు, ఆయన అందించిన సంగీత మాధుర్యం నేటికీ కోట్లాది మంది అభిమానుల హృదయాలను తాకుతూనే ఉన్నాయి. నాలుగు దశాబ్దాలకు పైగా ఆయన స్వరపరిచిన వేల కొద్దీ పాటలు ఈ రోజుకీ ఎవర్‌గ్రీన్ హిట్‌లుగా నిలుస్తున్నాయి. ఆయన పాటల ప్రత్యేకత ఏంటంటే, అందులోని మాధుర్యం కాలంతో కూడి తగ్గిపోకుండా తరతరాలను ఆకట్టుకోవడమే.కానీ గత కొన్నేళ్లుగా ఇళయరాజా (Ilayaraja) పేరు తరచూ కాపీరైట్ వివాదాల నేపథ్యంలో వినిపిస్తోంది. తాను స్వరపరిచిన పాటలను అనుమతి లేకుండా వాడుకోవడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే పలువురిపై కాపీరైట్ ఉల్లంఘన కేసులు వేసిన ఆయన తాజాగా మరోసారి కోర్టు తలుపు తట్టారు.

ఈ పాటలను సినిమాలో వాడుకోవడం

‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly Movie) అనే తమిళ చిత్రంలో ఆయన అనుమతి లేకుండా కొన్ని ప్రసిద్ధ పాటలను వాడుకున్నారని ఇళయరాజా ఆరోపిస్తున్నారు. అజిత్‌కుమార్ హీరోగా, అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ‘ఇళమై ఇదో ఇదో’, ‘ఒత్త రూబాయుం తారెన్’, ‘ఎన్‌ జోడి మంజకరువి’ వంటి సూపర్‌హిట్ పాటల బిట్స్‌ను మైత్రీ మూవీ మేకర్స్ వినియోగించారని ఆయన న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు.

సంగీతకారుడు ఇళయరాజా తరపు న్యాయవాదులు త్యాగరాజన్, శరవణన్ వాదన ప్రకారం – తన అనుమతి లేకుండా ఈ పాటలను సినిమాలో వాడుకోవడం కాపీరైట్ చట్టానికి విరుద్ధమని స్పష్టం చేశారు. ఈ కారణంగా నిర్మాతలపై రూ.5 కోట్ల పరిహారం విధించాలని, అలాగే వారం రోజుల్లో ఆ పాటల భాగాలను సినిమా నుంచి తొలగించాలనే ఆదేశాలు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు.ఈ కేసు ధర్మాసనం ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది.

Latest News

సినిమా కూడా తనతోనే చేసేందుకు

అజిత్‌కుమార్, త్రిష హీరో హీరోయిన్లుగా అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో వచ్చిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం తొలిరోజే మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకుంది. అయినప్పటికీ అనూహ్యంగా రూ.250 కోట్లకు పైగా కలెక్షన్లతో అజిత్ సత్తాని నిరూపించింది. అధిక్ వర్క్‌కి ఇంప్రెస్ అయిన అజిత్.. నెక్ట్స్ సినిమా కూడా తనతోనే చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. అయితే తాజాగా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ కాపీరైట్ ఇష్యూతో వార్తల్లోకెక్కడం చర్చనీయాంశమైంది. కొత్త సినిమాల్లో సందర్బానుసారం పాత ట్యూన్స్‌ని వాడుకోవడం ఎప్పటి నుంచో ఉందని, దానికే కేసులు పెట్టడం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఈ వ్యవహారంలో చాలామంది ఇళయరాజాని తప్పుబడుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ నిర్మాత దగ్గర డబ్బులు తీసుకుని ట్యూన్స్ ఇస్తాడు కాబట్టి, వాటిపై అన్ని హక్కులు నిర్మాతకే ఉంటాయి తప్ప, మ్యూజిక్ డైరెక్టర్స్‌కి ఉండవని అంటున్నారు. సినీ ఇండస్ట్రీలో లెజెండ్‌గా గుర్తింపు పొందిన ఇళయరాజా అంటే అందరికీ గౌరవం ఉంటుందని, ఇలాంటి చర్యలతో తన ప్రతిష్ఠను ఆయనే తగ్గించుకుంటున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇళయరాజా ఎప్పుడు, ఎక్కడ జన్మించారు?

ఇళయరాజా 1943 జూన్ 2న తమిళనాడులోని తిరువారూర్ జిల్లా పన్నైపురంలో జన్మించారు.

ఇళయరాజా ఇప్పటివరకు ఎన్ని సినిమాలకు సంగీతం అందించారు?

ఆయన 1,000కి పైగా సినిమాలకు సంగీతం సమకూర్చారు. దాదాపు 7,000కి పైగా పాటలు కంపోజ్ చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Read also:

https://vaartha.com/madarasi-cinema-review/review/542168/

adhik ravichandran Ajith Kumar Breaking News copyright case good bad ugly movie ilayaraja kollywood controversy latest news Mythri movie makers Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.