📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు

Latest News: Thaman బాలకృష్ణ గారిని చూస్తే నాకు మాటలు రావు

Author Icon By Anusha
Updated: August 31, 2025 • 10:02 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న నటుడు నందమూరి బాలకృష్ణ. ఆయన కెరీర్‌కి 50 ఏళ్లు పూర్తి కావడం, ఆ ప్రయాణం అంతా విజయాలతో, అభిమానం సంపాదించడంలోనే గడవడం విశేషం. ఇటీవల వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ బాలయ్య (World Book of Records Balayya) కు ఈ అరుదైన గౌరవాన్ని అందించింది. ఈ కార్యక్రమంలో సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు పాల్గొని ఆయనను ఘనంగా సత్కరించారు.బాల నటుడిగా ‘తాత మనవడు’లో ఎంట్రీ ఇచ్చిన బాలయ్య, తర్వాత హిట్ సినిమాలతో తనదైన స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ముఖ్యంగా పౌరాణిక, యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలతో ఆయనకున్న ఫ్యాన్ బేస్‌కి రెండో స్థానం లేదని చెప్పొచ్చు ‘అఖండ’ వరకు వచ్చిన ప్రతీ చిత్రంలో బాలయ్య ఎనర్జీ ప్రేక్షకులను మైమరిపించింది.ఈ ఏడాది విడుదలైన ‘డాకు మహారాజ్’ భారీ విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో పాటు అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఈ విజయంతో బాలయ్య మరోసారి తన మార్కెట్, తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు.

వచ్చే సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు

ప్రస్తుతం బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2’లో నటిస్తున్నారు. ఈ చిత్రం మొదట సెప్టెంబర్ 25న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే నిర్మాణ సంబంధిత కారణాల వల్ల వాయిదా వేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. కానీ కొత్త రిలీజ్ డేట్‌ను ఇంకా వెల్లడించలేదు. ఈ జోడీ నుంచి వచ్చే సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.దీని తర్వాత ఆయన గోపీచంద్ మలినేనితో, క్రిష్ జాగర్లమూడితో సినిమాలు చేయనున్నారు. ఈ వయసులో కుర్రాళ్ల కంటే వేగంగా సినిమాలు తీస్తోన్న బాలయ్య ఎనర్జీని చూసేస్తే ముచ్చటేస్తుంటుంది. నందమూరి బాలకృష్ణ (Balakrishna) 50 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తిచేసుకున్న సందర్బంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆయన్ని ఘనంగా సత్కరించింది. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇటీవల కాలంలో తన బీజీఎంతో బాలయ్య సినిమాలకు ప్రాణం పోస్తున్న తమన్ ఈ కార్యక్రమంలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Latest News

బాలయ్య బాబు అన్ని రికార్డులు

‘బాలకృష్ణ గారిని చూస్తే నాకు మాటలు రావు. ఆయన్ని ఏదైనా తీసుకుని కొట్టాలనిపిస్తుంది. బాలయ్య సినిమాలంటే మీకు అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందని చాలామంది నన్ను అడుగుతుంటారు. ఆ విషయం నాక్కూడా తెలియదు. ఆయన సినిమాలకి మ్యూజిక్ చేస్తున్నప్పుడు నా చేతుల్లో కొత్తగా కత్తులు, కర్రలు వచ్చేస్తాయి. అలా ఎందుకు జరుగుతుందో డాక్టర్స్ నా డీఎన్ఏని టెస్ట్ చేయాలి’ అని సరదాగా అన్నారు తమన్. ‘అఖండ 2’ గురించి మాట్లాడుతూ.. ఆ సినిమాతో బాలయ్య బాబు అన్ని రికార్డులు తిరగరాస్తారు. ‘అఖండ’ కంటే ఎన్నోరెట్లు అద్బుతంగా ఉంటుంది. ఈరోజు బాలయ్య బుక్ రికార్డులు చూస్తున్నారు. త్వరలో రాబోయే ‘అఖండ 2’తో ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు చూస్తారు’ అంటూ హైప్ పెంచేశారు తమన్. చాలామంది తన కెరీర్‌ని ‘అఖండ’ బిఫోర్, ఆఫ్టర్ అని అంటున్నారని, తనకి ఇంత పేరు రావడానికి బాలయ్యే కారణమని తెలిపారు.

ఇండస్ట్రీని డెవలప్‌ చేయాల్సిన అవసరం ఉంది

ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ… ఎన్ని సినిమాలు చేశామన్నది తప్ప రికార్డుల గురించి నేను పట్టించుకోను. ఎప్పుడూ నాన్నగారి స్ఫూర్తితోనే ఆయన దారిలో వెళ్తుంటా. ఏపీలో ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్‌ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయి. కళకి ప్రాంతం, భాషా అన్న భేదం లేదు. తెలుగు సినిమా ఆస్కార్ రేంజ్‌కి వెళ్లింది. తెలుగు వారి సత్తా ఏంటో సినిమాల ద్వారా ప్రపంచానికి చాటగలుగుతున్నాం. ఇది తెలుగువారిగా మనమంతా గర్వించాల్సిన సమయం’ అని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/latest-news-nandamuri-balakrishna-makes-huge-donation-to-flood-victims/telangana/538747/

balakrishna akhanda 2 boyapati srinu balakrishna Breaking News daco maharaj hit gopichand malineni balakrishna latest news nandamuri balakrishna movies Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.