యూట్యూబ్ వేదిక ద్వారా అనేక మంది యువత తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. కామెడీ వీడియోలతో సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న వారిలో మౌళి తనూజ్ (Mauli Tanuj) ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. మొదట “#90స్” వెబ్ సిరీస్‌లో నటుడిగా ప్రేక్షకులను అలరించిన ఆయన, ఇప్పుడు “లిటిల్ హార్ట్స్” సినిమా (“Little Hearts” movie) తో హీరోగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు.
తొలి సినిమాతోనే విజయాన్ని సాధించడం
ఈ చిత్రం సెప్టెంబర్ 5న విడుదలై, మొదటి రోజు నుంచే ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా అనుకున్న దానికంటే ఎక్కువ వసూళ్లు రాబట్టి, విడుదలైన రోజే బ్రేక్ ఈవెన్ సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ స్థాయిలో తొలి సినిమాతోనే విజయాన్ని సాధించడం నిజంగా అరుదైన విషయం.
దీంతో మౌళిపై అభిమానులు, సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.సినిమాలకు దూరంగా ఉంటున్నా సోషల్ మీడియాలో చురుకుగా ఉండే బండ్ల గణేశ్, మౌళి విజయాన్ని అభినందిస్తూ ఓ ట్వీట్ చేశారు. “కొడితే నీలా కొట్టాలిరా బాబు దెబ్బ.. చంపేసావు.. ఇక దున్నేయ్ టాలీవుడ్ నీదే” అంటూ ఆయన పోస్ట్ చేసారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: