📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Anchor Udayabhanu – నాకు అవకాశాలు రాకుండా చేసారు

Author Icon By Anusha
Updated: September 4, 2025 • 2:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సినిమా హీరోయిన్స్ మాత్రమే కాదు, యాంకర్స్ కూడా తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకోవడంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. వేదికపైకి వచ్చి సొంత మాటలతో, సొగసైన హావభావాలతో ప్రేక్షకులను అలరించే యాంకర్స్ రాణిస్తున్న తీరు నిజంగా విశేషం. బుల్లితెరపై ఈ తరహా స్టార్ యాంకర్స్‌లో ఎప్పటికీ ముందుగా గుర్తుకు వచ్చేది సుమ కనకాల (Suma Kanakala). ఆమె తన చమత్కారాలతో, అందరిని ఆకట్టుకునే తీరుతో టెలివిజన్‌లో రాజ్యమేలుతోంది. అలాగే అనసూయ, రష్మీ, శ్రీముఖి వంటి యాంకర్స్ కూడా ప్రస్తుతం విపరీతమైన ఆదరణను సొంతం చేసుకున్నారు. అయితే ఈ తరానికి ముందే ఒక అద్భుతమైన యాంకర్ టెలివిజన్ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఆమె ఎవరో కాదు – ఉదయభాను.

టెలివిజన్ ప్రపంచంలో

ఉదయభాను పేరు చెప్పగానే ఆ సమయానికే ప్రేక్షకుల కళ్లముందు ఉత్సాహంగా, అందంగా, తన మాటలతో వేదికను కదిలించే ఓ ఉల్లాసమైన వ్యక్తిత్వం ప్రత్యక్షమవుతుంది. ఒకప్పుడు ఆమె పేరు తెలుగు టెలివిజన్ ప్రపంచంలో అగ్రగణ్యంగా నిలిచింది. ప్రముఖ చానల్‌లో ప్రసారమైన “హృదయాంజలి” అనే కార్యక్రమంతో ఉదయభాను యాంకర్‌ (Anchor Udayabhanu) గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. మొదటి షోతోనే గలగలా మాట్లాడుతూ ప్రేక్షకులను అలరించింది. తక్కువ సమయంలోనే టెలివిజన్ అభిమానులకు ఎంతో చేరువైంది.

యాంకర్ కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది

ఇక యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఆతర్వాత చాలా కార్యక్రమాలకు యాంకర్ గా చేసి పాపులర్ అయ్యింది. వన్స్ మోర్ ప్లీజ్, సాహసం చేయరా డింబకా , డ్యాన్స్ బేబీ డ్యాన్స్, రేలారే రే రేలా, ఢీ రియాలిటీ డ్యాన్స్ షో, జాణవులే నెరజాణవులే, పిల్లలు పిడుగులు ఇలా చాలా పాపులర్ షోల్లో యాంకర్ కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక యాంకర్ గానే కాదు సినిమాల్లోనూ నటించింది ఉదయభాను. 10 వతరగతి చదువుతుండగా మొదటి సినిమా ఎర్ర సైన్యంలో చేసింది ఉదయభాను.తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినిమాలో నటించింది ఉదయభాను. 

ఓ ఈవెంట్ లో యాంకరింగ్

ఇక పెళ్లి తర్వాత ఉదయభాను బుల్లితెర పై కనిపించలేదు. ఇక ఇప్పుడు తిరిగి సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు ఉదయభాను. ఇటీవలే త్రిబాణధారి బార్బరిక్‌ అనే సినిమాలో నటించింది ఉదయభాను. సినిమాలతో పాటు అడపాదడపా యాంకరింగ్ కూడా చేస్తుంది ఉదయభాను. మొన్నామధ్య ఓ ఈవెంట్ లో యాంకరింగ్ లో సిండికేట్ ఏర్పడింది అని షాకింగ్ కామెంట్స్ చేసింది ఉదయభాను. అయితే సుమను ఉద్దేశించి ఆమె కామెంట్స్ చేసిందకొంతమంది అభిప్రాయపడుతున్నారు. దాంతో రీసెంట్ గా సుమ భర్త రాజీవ్ కనకాల సెటైర్ వేశారు. తిరిగి దీని పై ఉదయభాను కౌంటర్ ఇచ్చింది.

గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకుని ఈ స్థాయికి వచ్చా

12 ఏళ్ల వయసు నుంచి యాంకరింగ్ చేయడం మొదలుపెట్టాను.. చాలామంది హీరోలతో కలిసి పనిచేశాను. యాంకరింగ్ లో సిండికేట్ అనేది నాకు జరిగింది. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది యాంకర్లు ఉన్నారు. నేను కూడా ఉన్నాను కదా.. చిన్న ఏజ్ నుంచి స్ట్రగుల్ అవుతూ ఈ స్థాయికి వచ్చాను. గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకుని ఈ స్థాయికి వచ్చా.. చిన్నప్పటి నుంచి యాంకరింగ్ చేస్తున్నా.. ఇప్పటికీ జడ్జ్ చేస్తే ఎలా? చాలామంది నాకు అవకాశాలు రాకుండా కుట్ర చేశారు.. ఈవెంట్స్ కు వచ్చి తిరిగివెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. “నదిని ఎవ్వరూ బంధించలేరు.. సూర్యుడ్ని ఆపలేరు. మధ్యలో గ్రహణం పట్టినా.. సూర్యుడు వెలుగులోకి రావాల్సిందే. నేను కూడా అలానే ఉదయిస్తా అని ఉదయభాను అన్నారు.

ఉదయభాను ఎప్పుడు, ఎక్కడ జన్మించారు?

ఉదయభాను 1973 ఆగస్టు 5న తెలంగాణ రాష్ట్రంలోని జాగిత్యాల జిల్లాలో జన్మించింది.

ఆమె కెరీర్ ఎక్కడి నుంచి ప్రారంభమైంది?

ఉదయభాను 15 ఏళ్ల వయసులోనే సినిమాల్లో నటించింది. తరువాత టెలివిజన్‌లోకి అడుగుపెట్టి “హృదయాంజలి” అనే కార్యక్రమంతో యాంకర్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది.

Read hindi news : hindi.vaartha.com

Read also :

https://vaartha.com/telugu-news-actor-darshan-case-concern-in-court/cinema/actor/540887/

anchoring career Breaking News childhood struggle event hosting government school latest news opportunities struggle telugu anchor Telugu News Telugu television tv industry Udaya Bhanu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.