📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Adithya Vikrama Vyuha Movie – ఆదిత్య విక్రమ వ్యూహ (ఆహా) మూవీ రివ్యూ

Author Icon By Anusha
Updated: September 7, 2025 • 3:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

క్రైమ్ థ్రిల్లర్ జానర్లో రూపొందిన “ఆదిత్య విక్రమ వ్యూహ” సినిమా (Adithya Vikrama Vyuha Movie) తాజాగా ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’లో విడుదలైంది. ఈ సినిమా ప్రత్యేకంగా థియేటర్లలో విడుదల కాకుండా నేరుగా ఓటీటీలో రాబోవడం, ప్రేక్షకుల కోసం మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తోంది. శ్రీ హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.ఈ నెల 5వ తేదీ నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది. శ్రీ హర్ష దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

కథ

విక్రమ్ తన బాల్యంలోనే తల్లిని కోల్పోతాడు. అతని తండ్రి ఓ స్కూల్ టీచర్. అయితే అతను 15 ఏళ్లుగా జాబ్ మానేసి ఇంట్లోనే ఉంటూ ఉంటాడు. విక్రమ్ కి పెద్దగా చదువు అబ్బదు. కానీ తెలివితేటలు బాగా ఉంటాయి. అందువలన క్రైమ్ కి సంబంధించిన విషయాల్లో .. ఆధారాల ద్వారా ఆ నేరస్థులు ఎవరనేది చెబుతూ పోలీసులకు సహకరిస్తూ ఉంటాడు.

వాళ్లిచ్చిన డబ్బులతో బ్రతికేస్తూ ఉంటాడు.అలాంటి  విక్రమ్ ను ఒక పోలీస్ ఆఫీసర్ (Police officer) కలుసుకుంటాడు. నగరంలో వరుసగా జరుగుతున్న హత్యలను గురించి ప్రస్తావించాడు. హత్య జరిగిన ప్రదేశంలో హంతకుడు ఒక ‘పెయింటింగ్’ ను వదిలేసి వెళుతూ ఉంటాడు. అందువలన కిల్లర్ ను ‘పెయింటర్’ పేరుతో పిలుస్తూ ఉంటారు. అయితే ఏడాదిలో ఒక వారం రోజులు మాత్రమే కిల్లర్ వరుస హత్యలు చేస్తూ ఉంటాడు. పోలీస్ ఆఫీసర్ ఆదిత్యతో కలిసి సీరియల్ కిల్లర్ ను పట్టుకోమని కోరతాడు. 

atest News

కథనం

హంతకుడు ఎవరనేది చెబితే తనకి 15 లక్షలు వస్తాయనే ఆశతో విక్రమ్ అందుకు ఒప్పుకుంటాడు. ఈ కేసును పరిశోధించే ఆదిత్యను కలుసుకుంటాడు. అప్పటికే ఒక హత్య చేసిన పెయింటర్ ను మిగతా హత్యలు చేసేలోగా పట్టుకోవాలని ప్లాన్ చేస్తారు. పెయింటర్ ఎవరు? ఎందుకు అతను వరుస హత్యలు చేస్తున్నాడు? విక్రమ్ కీ .. ఆదిత్యకి గల సంబంధం ఏమిటి? అనేది మిగతా కథ. ఆదిత్య పోలీస్ ఆఫీసర్. విక్రమ్ నేరాలకు సంబంధించిన విచారణలో అతనికి సహకరించే వ్యక్తి. ప్రధానమైన కథ అంతా కూడా ఈ ఇద్దరి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ తరహా కథల్లో మూడు ప్రధానమైన అంశాలు ఆసక్తిని రేపుతూ ఉంటాయి. నేరం ఎవరు చేశారు? ఎందుకు చేశారు? నేరస్థులను పట్టుకోవడానికి పోలీసులు ఎలాంటి వ్యూహాలను రచించారు అనేవే ప్రధానం. 

ఇన్వెస్టిగేషన్ ప్రధానమైన

క్రైమ్ థ్రిల్లర్ కథల్లో ఇన్వెస్టిగేషన్ అనేదే ప్రేక్షకులను కూర్చోబెట్టడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. హత్యలు ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనేది చివర్లోనే రివీల్ అవుతూ ఉంటుంది. అప్పటివరకూ జరిగే ఇన్వెస్టిగేషన్ ప్రధానమైన పాత్రను పోషించవలసి ఉంటుంది. ఈ కథలో అలా జరిగిందా అంటే జరగలేదనే చెప్పాలి. కథ అయోమయంగా ఎటువైపు తోస్తే అటు పరిగెడుతూ ఉంటుంది.

కథ బలమైనదీ కాదు .. కథనంలో ఆసక్తి కనిపించదు. సన్నివేశాలు చాలా పేలవంగా సాగిపోతూ ఉంటాయి. సన్నివేశాలలో సహజత్వం కనిపించదు. నాటకీయంగా .. కృతకంగా నడుస్తూ ఉంటాయి. ఆర్టిస్టుల నుంచి సరైన అవుట్ పుట్ తీసుకోకపోవడం కూడా అందుకు ఒక కారణమని చెప్పాలి. సన్నివేశాలు .. డైలాగ్స్ కూడా పేలవంగా అనిపిస్తాయి. 

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/latest-news-manchu-manoj-manchu-manoj-bellamkonda-srinivas-stand-by-ntr-fan/cinema/542796/

aditya vikram vyooh movie aha streaming release Breaking News crime thriller telugu direct otto release latest news sri harsha director Telugu Movies 2025 Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.