తెలుగు ప్రేక్షకులకు సాహసం శ్వాసగా సాగిపో సినిమాతో పరిచయమైన నటి మంజిమా మోహన్ (Actress Manjima Mohan), తన నటనతో మంచి గుర్తింపు పొందింది. అక్కినేని నాగచైతన్య సరసన “లీలా” పాత్రలో ఆమె చేసిన నటనకు ప్రత్యేకమైన ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్లో నారా భువనేశ్వరీ పాత్రలో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఎన్టీఆర్ బయోపిక్‌లోనూ ఓ కీలక పాత్ర పోషించి మంచి మార్కులు వేసుకుంది. విష్ణు విశాల్ ఎఫ్‌ఐఆర్ చిత్రంలోనూ ఓ కీలక పాత్రలో నటించి మెప్పించింది.2022లో కోలీవుడ్ స్టార్ గౌతమ్ కార్తీక్‌ను ప్రేమించి వివాహం చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచింది.మంజిమా మోహన్ మలయాళంలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ (Star heroine) గా వెలుగొందింది. అయితే వివాహం తర్వాత సినిమాలకు కొంత దూరంగా ఉంటూ, వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తోంది. ఈ సమయంలో తన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటే, కొందరు నెటిజన్లు ఆమె శరీరాకృతిపై నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు.
బాడీ షేమింగ్ అనుభవం
ఈక్రమంలో తన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు కొందరు నెటిజన్లు తన శరీరాకృతిపై కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంజిమా మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నేను బరువు తగ్గితే నాకు ఆఫర్స్ వస్తాయి. కానీ జీవితానికి అదే ముఖ్యం కాదు. హీరోయిన్స్‌ను బాడీ షేమింగ్ చేసేవారు శరీరం తప్ప ఇంకేమీ కనిపించవా.? సినిమా అనేది నా జీవితంలో ఒక భాగం మాత్రమే.. నాకు ఇంకా ఎన్నో ఆశయాలు ఉన్నాయి. బరువు పెరగడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డానని మంజిమ తెలిపింది. ఇక ఈ నొప్పిని తట్టుకునే ఓపిక నాకు లేదని ఆమె చెప్పుకొచ్చింది. అలాగే బరువు తగ్గడానికి సర్జరీ చేయించుకోవాలనుకున్నా.. ప్రతి ఒక్కరూ హెల్దీగా, ఫిట్‌గా ఉండాలనే అనుకుంటారు. అయితే కొందరు సహజసిద్ధంగానే లావుగా ఉంటారు. ఈ విషయంలో వారిని ఏ మాత్రం తప్పుపట్టలేం. అందువల్ల దయచేసి ఒకరి శరీరాకృతిపై కామెంట్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి.
తెలుగు ప్రేక్షకులకు మంజిమా మోహన్ ఎలా పరిచయం అయ్యారు?
అక్కినేని నాగచైతన్య హీరోగా వచ్చిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో “లీలా” పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.
మంజిమా మోహన్ నటించిన ముఖ్యమైన సినిమాలు ఏమిటి?
సాహసం శ్వాసగా సాగిపో (తెలుగు), ఎన్టీఆర్ బయోపిక్లో నారా భువనేశ్వరీ పాత్ర, ఎఫ్‌ఐఆర్ (తమిళం) వంటి చిత్రాల్లో నటించారు.
Read hindi news: https://hindi.vaartha.com/
Read Also: