📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం

Latest News: Kurukshetra Series: కురుక్షేత్ర (నెట్ ఫ్లిక్స్) వెబ్ సిరీస్ రివ్యూ

Author Icon By Aanusha
Updated: October 11, 2025 • 6:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇప్పటికే యానిమేటెడ్ (Animated) కంటెంట్ ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ప్రాచుర్యం పొందుతుంది. సాంకేతికతలో వచ్చిన పురోగతి, అధునాతన గ్రాఫిక్స్, 3D రియాలిస్టిక్ ఎఫెక్ట్స్ ద్వారా ప్రేక్షకులకు పూర్తిగా వాస్తవానికి సమానమైన అనుభవాన్ని ఇవ్వడం సులభమైంది. తెలుగు ఇండస్ట్రీలో కూడా ఈ యానిమేషన్ ట్రెండ్ త్వరగా విస్తరిస్తోంది. సైన్స్ ఫిక్షన్, ఆధ్యాత్మికత, పురాణ కథలు, మిథాలజీ కథలు వంటి విభాగాల్లో యానిమేషన్ వినియోగం పెరిగిపోతోందని స్పష్టంగా కనిపిస్తోంది.

Srinidhi Shetty: తెలుసు క‌దా సినిమా గురించి శ్రీనిధి శెట్టి ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు

అలా వచ్చిన ‘మహావతార్ నరసింహా’ సినిమా (‘Mahavathar Narasimha’ movie) భారీ వసూళ్లను రాబట్టగా, సిరీస్ రూపంలో ‘కురుక్షేత్ర’ రూపొందడం జరిగింది. గతంలో మహాభారతం నేపథ్యంలో చాలానే సినిమాలు .. ధారావాహికలు వచ్చాయి. అయితే ‘కురుక్షేత్ర’ (Kurukshetra Series) ఘట్టాన్ని ప్రధానంగా తీసుకుని ఈ సిరీస్ ను రూపొందించారు. ఈ  నెల 10వ తేదీ నుంచి 10 భాషల్లో ఈ సిరీస్ ‘నెట్ ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది.

18 రోజుల పాటు జరిగిన ‘కురుక్షేత్ర’ (Kurukshetra Series) యుద్ధాన్ని 18 ఎపిసోడ్స్ గా రూపొందించారు. ప్రస్తుతం 9 ఎపిసోడ్స్ స్ట్రీమ్ లోకి వచ్చాయి. మిగతా ఎపిసోడ్స్ ఈ నెల 24న అందుబాటులోకి రానున్నాయి. ఉజాన్ గంగూలీ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

కథ

పాండవులు అరణ్యవాసం .. అజ్ఞాతవాసం పూర్తి చేస్తారు. అయినా వారికి ఇవ్వవలసిన రాజ్య భాగాన్ని ఇవ్వకుండా కౌరవులు మాట తప్పుతారు. చివరికి ఐదుగురికి ఐదు ఊళ్లు ఇవ్వమన్నా కూడా నిరాకరిస్తారు. దురాశతో దుర్యోధనుడు (Duryodhana) మొండిపట్టుపడతాడు. అతనిపై ధృత రాష్ట్రుడికి గల వాత్సల్యం .. గాంధారి మౌనం .. శకుని ఎత్తుగడలు .. కర్ణుడి అండదండలు .. అశ్వద్ధామ పరాక్రమం ..

ద్రోణాచార్యుడి పట్ల గల నమ్మకం దుర్యోధనుడు దురుసుగా ముందుకు వెళ్లడానికి కారణమవుతాయి. కృష్ణుడు చేసిన సూచన మేరకు పాండవులు ఓపిక పడతారు. ఈ విషయంలో సంజయుడి రాయబారం కూడా విఫలమవుతుంది. కౌరవులు యుద్ధం పట్ల ఉత్సాహంతో ఉన్నారనే విషయం పాండవులకు అర్థమవుతుంది. దాంతో వారు కూడా యుద్ధానికి సమాయత్తమవుతారు. కృష్ణుడి దగరికి వెళ్లిన దుర్యోధనుడు, యుద్ధంలో తమకి సాయంగా ఉండమని కోరతాడు.

Kurukshetra Series

విశ్లేషణ

అదే మాటను అర్జునుడు కూడా అడుగుతాడు.తాను ఆయుధం పట్టనని చెప్పినా ఆయన ఒక్కడు తనవైపు ఉంటేచాలని అర్జునుడు కోరగా, కృష్ణుడి సైన్యం తన వైపుకు రావడం పట్ల దుర్యోధనుడు సంతోషిస్తాడు. ‘కురుక్షేత్ర’ యుద్ధం (The Battle of Kurukshetra) మొదలవుతుంది. తన వాళ్ల ప్రాణాలను తీయడం వలన లభించే విజయం .. రాజ్యసుఖం తనకి అవసరం లేదని అర్జునుడు అంటాడు.

అప్పుడే ఆయనకి కృష్ణుడు గీతోపదేశం చేస్తాడు. దాంతో అర్జునుడు తిరిగి ఆయుధాలు చేపడతాడు. ఆ తరువాత ఏం జరుగుతుంది? ఈ యుద్ధంలో ఎవరి పాత్ర ఏమిటి? అనేది మిగతా కథ.’రాస్తే రామాయణమంత .. చెబితే మహాభారతమంత’ అని అంటూ ఉంటారు.

అంటే మహాభారతం అంత పెద్దదిగా ఉంటుందని అర్థం. అలాంటి మహాభారతంలోని ‘కురుక్షేత్రం’ ఈ సిరీస్ లోని ప్రధానమైన కథాంశం. ఈ సిరీస్ ఫస్టు ఎపిసోడ్ లో సంజయుడి రాయబారం విఫలమవుతుంది. రెండో ఎపిసోడ్ లో యుద్ధం మొదలవుతుంది. ఒక్కో ఎపిసోడ్ ను  ఒక్కో ప్రధానమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు.     

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

animated movies Kurukshetra series latest news Movie Review Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.