Kriti Sanon: అల్లు అర్జున్‌తో పనిచేయాలని ఉందన్న కృతి

Read Time:  1 min
Kriti Sanon: అల్లు అర్జున్‌తో పనిచేయాలని ఉందన్న కృతి
FONT SIZE
GET APP

టాలీవుడ్‌లో మహేష్ బాబుతో ‘1 నేనొక్కడినే’ సినిమాతో పరిచయమైన కృతి సనన్ (Kriti Sanon), ఆ తర్వాత బాలీవుడ్ వెళ్ళిపోయి అక్కడ నేషనల్ అవార్డ్ గెలుచుకునే స్థాయికి ఎదిగింది, కృతి సనన్. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనకు టాలీవుడ్‌లో మరో స్టార్ హీరోతో నటించాలని ఉందని, ముఖ్యంగా అతని స్టైల్, యాక్టింగ్ అంటే తనకు చాలా ఇష్టమని ఆమె మనసులో మాట బయటపెట్టింది.

Read Also: 2025 Movies: ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

Kriti Sanon wants to work with Allu Arjun
Kriti Sanon wants to work with Allu Arjun

ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకుంటా

తాజాగా ఒక ఇంటర్వ్యూలో కృతి సనన్ (Kriti Sanon) మాట్లాడుతూ.. తనకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమని వెల్లడించింది. “అల్లు అర్జున్ గారి స్టైల్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, అద్భుతమైన డ్యాన్స్ చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. ఆయనతో కలిసి ఒక కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్‌లో నటించాలని నాకు చాలా కోరికగా ఉంది. సరైన కథ కుదిరితే తప్పకుండా ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకుంటాను” అని తన మనసులోని కోరికను బయటపెట్టింది. గతంలో కూడా అల్లు అర్జున్ సినిమా చూసినప్పుడు కృతి ఆయన పర్ఫార్మెన్స్‌ను మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.