టాలీవుడ్ పరిశ్రమలో మరోసారి సంచలనం రేపిన సంఘటన చోటు చేసుకుంది. ప్రముఖ డ్యాన్స్ షో “ఢీ” ద్వారా గుర్తింపు పొందిన కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్పై పోక్సో చట్టం (POCSO Act) కింద కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
మైనర్ బాలికపై అసభ్య ప్రవర్తన ఆరోపణలు
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో నమోదైన వివరాల ప్రకారం, కృష్ణ మాస్టర్ (Krishna master) ఒక మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా పోక్సో (Protection of Children from Sexual Offences Act) చట్టం కింద కేసు నమోదు చేశారు.
కేసు నమోదు అయిన అనంతరం కృష్ణ మాస్టర్ (Krishna master) అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే, ఆయన బెంగళూరు (Bangalore) లోని తన అన్న ఇంటిలో ఉంటున్నారని సమాచారం పొందిన గచ్చిబౌలి పోలీసులు, అక్కడికి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం, కృష్ణ మాస్టర్‌ను కంది జైలుకు తరలించారు. ఆసక్తికర విషయం ఏమిటంటే, ఇటీవలే కృష్ణ ఒక మహిళతో వివాహం చేసుకున్నాడని సమాచారం. అయితే, తన భార్యకు సంబంధించిన ₹9 లక్షల నగదును తీసుకుని బయటకి వెళ్లిపోయాడని కూడా ఆరోపణలు ఉన్నాయి.
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మోసాలు?
మరింతగా, గతంలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పలువురు మహిళలను, యువతులను మోసం చేశాడన్న ఆరోపణలు కూడా కృష్ణపై ఉన్నాయి. ఈ ఆరోపణలపై పోలీసులు మరింత దర్యాప్తు జరుపుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: