📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Kotha lokah chapter1: ఓటీటీ లో కి వచ్చిన కొత్త లోక చాప్టర్ 1

Author Icon By Shiva
Updated: October 7, 2025 • 5:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కొత్త రికార్డు – ‘లోక 1: చంద్ర’ సంచలనం

ఇటీవల మలయాళ సినీ పరిశ్రమలో వచ్చిన ఒక సినిమా ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారి తీసిన ఈ చిత్రం, లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కొత్త రికార్డు సృష్టించింది. కేవలం ₹30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘లోక 1: చంద్ర’(Kotha lokah chapter1) అద్భుతమైన వసూళ్లతో ₹300 కోట్ల మార్క్‌ను దాటింది. ఇది మలయాళ సినిమా చరిత్రలో అరుదైన ఘనతగా నిలిచింది.

ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించగా, డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ ఈ సినిమాను నిర్మించారు. నెస్లెన్, శాండీ మాస్టర్, అరుణ్ కురియన్, చందూ వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. ఆగస్టు 28న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. తాజాగా ఈ చిత్రం అక్టోబర్ 20 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Read also: మానసిక ఒత్తిడి జయించడం ఎలా?

సూపర్ పవర్ గర్ల్ కథ – ఆసక్తికరమైన సస్పెన్స్

కథలోకి వస్తే చంద్ర అనే యువతి బెంగళూరులో అద్దె గదిలో నివసిస్తూ, ఒక హోటల్‌లో పనిచేస్తుంది. ఆమె ఎదురింట్లో నివసించే సన్నీ, చంద్ర ప్రవర్తనలోని ప్రత్యేకతను గమనించి ఆమెపై ఆసక్తి కనబరుస్తాడు. ఆమె దగ్గర సూపర్ పవర్స్ ఉన్నాయనే విషయం తెలిసిన తర్వాత, అతని జీవితం పూర్తిగా మారిపోతుంది. ఆ శక్తులను ఉపయోగించి చంద్ర ఏం చేస్తుంది? ఆమె జీవితంలో ఏ మార్పులు వస్తాయి? అనేది ఈ సినిమా మర్మం. ‘లోక 1: చంద్ర’లో(Kotha lokah chapter1)విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మరియు కల్యాణి ప్రియదర్శన్ నటన ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి. థ్రిల్లింగ్ కథనం, ఎమోషన్, సై-ఫై ఎలిమెంట్స్ మేళవింపుతో ఈ చిత్రం మహిళా కేంద్రిత సినిమాలకు కొత్త దిశను చూపించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: https://epaper.vaartha.com/

Read Also:

cinema news Hotstar Kotha lokah chapter1 Kotha lokah chapter1 Hotstar Kotha lokah chapter1 OTT Kotha lokah chapter1 review latest news OTT release 2025

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.