📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest News: OG movie: OG సినిమా టికెట్ రేట్ల పెంపుపై కోమటిరెడ్డి ఆగ్రహం?

Author Icon By Anusha
Updated: September 26, 2025 • 11:30 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన తాజా చిత్రం ‘ఓజీ’ ( OG movie) విడుదలకు ముందు నుంచే సంచలనాన్ని రేపింది. ఈ సినిమా కోసం భారీ ఎత్తున అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, టికెట్ ధరల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు కొత్త చర్చలకు దారితీశాయి.

తెలంగాణ హోంశాఖ ఇటీవల జారీ చేసిన జీవో ప్రకారం, సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు ప్రీమియర్ షోలకు జీఎస్టీతో కలిపి రూ.800 వరకు వసూలు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అంతే కాకుండా, సాధారణ ప్రదర్శనల కోసం సింగిల్ స్క్రీన్ల (Single screens) లో అదనంగా రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.150 వసూలు చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం విడుదలైన వెంటనే అభిమాన వర్గాల్లో సంతోషం వ్యక్తం కాగా, మరోవైపు కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

 Dr. B. R. Ambedkar: 30న అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ 26వ స్నాతకోత్సవం

OG movie

హైకోర్టులో సవాల్ చేయగా సింగిల్ బెంచ్

అయితే హోంశాఖ స్పెషల్ సీఎస్‌కు టికెట్ ధరలపై నిర్ణయం తీసుకునే అధికారం లేదంటూ మహేష్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో సవాల్ చేయగా సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ఆ జీవోను సస్పెండ్ చేశారు. దీంతో షాకైన ‘ఓజీ’ మేకర్స్ సింగిల్ జడ్సి ఇచ్చిన తీర్పుపై డివిజనల్ బెంచ్‌కి అప్పీల్ చేసుకోగా శుక్రవారం వరకు స్టే విధించింది.

‘ఓజీ’ టిక్కెట్ల రేట్ల పెంపుపై తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ‘ఓజీ’ టిక్కెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ జారీచేసిన జీవో తనకు తెలియకుండానే ఎందుకిచ్చారంటూ ఆయన హోం శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలొస్తున్నాయి.

తెలంగాణలోనూ జీవో ఇచ్చారని తాను అనుకుంటున్నట్లు

సినిమా టిక్కెట్ల అంశం సినిమాటోగ్రఫీ మంత్రినైన తనకే తెలియకపోతే అర్ధం ఏంటని ఆయన నిలదీశారట. ‘ఓజీ’ సినిమాకు ఆంధ్రప్రదేశ్ జీవో ఇచ్చారు కాబట్టే తెలంగాణ (Telangana) లోనూ జీవో ఇచ్చారని తాను అనుకుంటున్నట్లు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అంతేకాదు టిక్కెట్ల రేట్ల పెంప జీవోను సస్పెండ్ చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఆయన స్వాగతించినట్లు సమాచారం..

భవిష్యత్తులో తెలంగాణలో ఏ సినిమాకి టిక్కెట్ల రేట్లు పెంపు ఉండబోదని, చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా టిక్కెట్ రేట్లు (Ticket rates) సామాన్యులపై భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కోమటిరెడ్డి వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

భారీ చిత్రాలు రిలీజ్ కానున్న నేపథ్యంలో

మరోవైపు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘పుష్ప 2’ తొక్కిసలాట తర్వాత సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అసెంబ్లీలో మాట్లాడుతూ తెలంగాణలో ఇకపై ఏ సినిమాకి ప్రీమియర్ షోలకి అనుమతి ఇవ్వమని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. సీఎం సాక్షాత్తూ అసెంబ్లీలో చేసిన ప్రకటననే పక్కనబెట్టి చాలా సినిమాలకి ప్రీమియర్ షోలు,

టిక్కెట్ల రేట్ల పెంపునకు జీవోలు ఇచ్చిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు కొత్త పాట పాడుతోందని విమర్శిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. వచ్చే కొద్ది నెలల్లో టాలీవుడ్ నుంచి భారీ చిత్రాలు రిలీజ్ కానున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యల్ని సినీ పెద్దలు పరిశీలిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News gst charges latest news og movie controversy Power Star Pawan Kalyan premier shows telangana government Telugu News Ticket Price Hike tollywood

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.