తెలుగు సినిమా దర్శకుడు–రచయిత కిషోర్ తిరుమల (Kishore Tirumala). 2008లో ‘నేను మీకు తెలుసా’ సినిమాతో రచయితగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన, 2011లో దర్శకుడిగా మారారు. ప్రేమ, కుటుంబ సంబంధాలు, యువత భావోద్వేగాలను నిజాయితీగా చూపించడమే ఆయన సినిమాల ప్రత్యేకత. ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘చిత్రలహరి’, ‘రెడ్’, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ వంటి విభిన్న చిత్రాలతో దర్శకుడిగా స్థిరపడ్డారు. ముఖ్యంగా ‘నేను శైలజ’ రామ్ పోతినేని కెరీర్‌లోనే కాదు, కిషోర్ తిరుమల ఫిల్మోగ్రఫీలో కూడా ఓ మైలురాయిగా నిలిచింది.
Read Also: Rajinikanth: అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన తలైవా
ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ‘నేను శైలజ’ సినిమా గురించి కిషోర్ తిరుమల (Kishore Tirumala)చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేశ్ ఎంపిక వెనుక జరిగిన ఆసక్తికర కథను ఆయన తొలిసారిగా బయటపెట్టారు. ‘శైలజ’ పాత్ర పూర్తిగా ఇంట్రోవర్ట్ స్వభావం కలిగిన పాత్ర కావడంతో, ఆ క్యారెక్టర్‌కు కీర్తి సురేశ్ అయితేనే పర్ఫెక్ట్‌గా సరిపోతుందని తాను మొదటి నుంచే నమ్మినట్లు తెలిపారు.
కీర్తి సురేశ్, శైలజ పాత్రకు ప్రాణం పోసింది
అయితే అది కీర్తికి తొలి సినిమా కావడంతో, నిర్మాతలు అప్పటికే ఫామ్‌లో ఉన్న ఒక స్టార్ హీరోయిన్‌ను తీసుకోవాలని సూచించారట.నిర్మాతల ఒత్తిడితో అప్పట్లో టాప్‌లో ఉన్న ఒక హీరోయిన్‌కు కథ చెప్పేందుకు వెళ్లానని, కానీ కావాలనే కథను పూర్తిగా ఎంగేజ్ అయ్యేలా చెప్పలేదని కిషోర్ తిరుమల వెల్లడించారు. కథ నచ్చలేదని ఆమె చెప్పగానే, తాను ఏమాత్రం బాధపడకుండా “థాంక్యూ” చెప్పి వచ్చేశానని చెప్పారు.
స్టార్ హీరోయిన్‌కు ఇప్పటికే ఉన్న ఇమేజ్‌ను బ్రేక్ చేసి, ‘శైలజ’గా ప్రేక్షకులు ఆమెను నమ్మేలా చేయడం కష్టమవుతుందని భావించానని, అందుకే కొత్త అమ్మాయి అయితేనే ప్రేక్షకులు ఆ పాత్రను సహజంగా స్వీకరిస్తారని రిస్క్ తీసుకున్నట్లు వివరించారు. చివరకు తన నమ్మకమే నిజమై, కీర్తి సురేశ్ నటనతో శైలజ పాత్రకు ప్రాణం పోసిందని చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: