📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Latest News: Kishkindapuri Movie: నేటి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కిష్కిందపురి

Author Icon By Anusha
Updated: October 17, 2025 • 1:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Srinivas) నటించిన తాజా చిత్రం ‘కిష్కిందపురి’ (Kishkindapuri Movie) ఎట్టకేలకు ఓటీటీ (OTT) లోకి చేరింది. ఈ చిత్రాన్ని జీ 5 (ZEE 5) సొంతం చేసుకున్నది, దీంతో ప్రేక్షకులు నేటి నుండి సినిమాను చూడవచ్చు. థియేటర్‌లో ఈ చిత్రం చూడనివారికి ఇది పెద్ద అవకాశం.

Read Also: Silambarasan: శింబు సామ్రాజ్యం ప్రోమో వచ్చేసింది?

‘కిష్కిందపురి’ (Kishkindapuri Movie) హర్రర్-థ్రిల్లర్ శైలి చిత్రంగా రూపొందించబడింది. సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలైన తర్వాత, సినిమాకు మంచి రెస్పాన్స్ లభించింది. బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన రాఘవ్ పాత్ర, ప్రేక్షకుల్ని మెప్పించింది.

రాక్షసుడు చిత్రం తర్వాత పెద్ద హిట్ లేని బెల్లంకొండకి ఈ చిత్రం ఊరట ఇచ్చింది. సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలైన ఈ హర్రర్-థ్రిల్ల‌ర్‌ చిత్రం, థియేట‌ర్‌లో మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంది. హీరో రాఘవ్ పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్ , హీరోయిన్ మైథిలి పాత్రలో అనుపమ పరమేశ్వర‌న్ (Anupama Parameswaran) కీల‌క పాత్ర‌లు పోషించారు.

Kishkindapuri Movie

కథేంటంటే

మామూలు కథను థ్రిల్‌గా మార్చే స్క్రీన్‌ప్లే, అనుపమ పరమేశ్వరన్‌ ప్రదర్శించిన నటన సినిమాను ప్రత్యేకంగా నిలిపింది. ఘోస్ట్ వాకింగ్ అనే పేరుతో థ్రిల్ ను కోరుకునే వారి కోసం లేని దెయ్యాలను ఉన్నాయని నమ్మిస్తూ ఘోస్ట్ హౌసెస్ లోకి టూర్లు కండక్ట్ చేస్తుంటారు హీరో ( పాత్ర పేరు రాఘవ), హీరోయిన్లు ( హీరోయిన్ పాత్ర పేరు మైథిలి).

ఈ క్ర‌మంలో కిష్కిందపురి అనే ఒక ఊరికి 11 మంది బ్యాచ్ తో కలిసి సువర్ణమాయ అనే రేడియో స్టేషన్ కు వెళ్తారు. అక్కడనుండి కథ మలుపు తీసుకోవ‌డంతో మూవీ ఇంట్రెస్ట్‌గా మారుతుంది. దెయ్యంలా మారిన వేదవతి ఎవరు. ఎందుకు అందరిని చంపాలనుకుంటుంది. వీరితో పాటు వెళ్లిన చిన్న పిల్లను కాపాడటానికి ప్రాణాలు కూడా లెక్క చెయ్యకుండా హీరో ఏమి చేసాడు అనేది చిత్ర క‌థ‌.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Bellamkonda Srinivas Breaking News Kishkindapuri latest news Telugu News zee5

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.