📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం తన కుమారుడికి శ్రీవారి సన్నిధిలో నామకరణం

Author Icon By Ramya
Updated: August 4, 2025 • 12:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నవతరం కథానాయకుడు కిరణ్ (Kiran Abbavaram) అబ్బవరం, ఆయన సతీమణి రహస్య తమ కుమారుడికి ‘హను అబ్బవరం’ అని నామకరణం చేశారు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల పుణ్యక్షేత్రంలో ఈరోజు ఈ వేడుకను అత్యంత భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

Kiran Abbavaram

తిరుమలలో నామకరణ వేడుక

Kiran Abbavaram: శ్రీవారి ఆశీస్సులతో పాటు, ఆంజనేయ స్వామి అనుగ్రహం తమ బిడ్డకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ పవిత్రమైన ప్రదేశాన్ని ఎంచుకున్నట్లు కిరణ్, రహస్య దంపతులు తెలిపారు. మే నెలలో హనుమాన్ జయంతి (Hanuman Jayanti) పర్వదినాన వారికి కుమారుడు జన్మించిన విషయం తెలిసిందే. ఈ శుభ సందర్భాన్ని, ఇప్పుడు నామకరణ వేడుకను దైవభక్తితో జరుపుకోవడంపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. తిరుమలలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కిరణ్ అబ్బవరం సంతోషం

ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మీడియాతో మాట్లాడుతూ తన సంతోషాన్ని పంచుకున్నారు. “ఆంజనేయ స్వామి అంటే మాకు ఎంతో భక్తి. ఆయనకు గుర్తుగా మా అబ్బాయికి ‘హను’ అని పేరు పెట్టాం. శ్రీవారి సన్నిధిలో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ క్షణాలు మా ఇద్దరికీ ఎంతో భావోద్వేగభరితంగా, మధురంగా మిగిలిపోతాయి” అని ఆయన అన్నారు.

కిరణ్ అబ్బవరం సినీ విశేషాలు

సినిమాల విషయానికొస్తే, కిరణ్ అబ్బవరం ప్రస్తుతం ‘కే రాంప్’ (K Ramp) అనే చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు, తన సొంత నిర్మాణ సంస్థ ‘కేఏ ప్రొడక్షన్స్’ ద్వారా కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు కూడా ఆయన సిద్ధమవుతున్నారు. నటుడిగా, నిర్మాతగా కిరణ్ అబ్బవరం కెరీర్ సజావుగా సాగాలని ఆశిద్దాం.

కిరణ్ అబ్బవరం బ్యాక్ గ్రౌండ్?

ఆయన బి. టెక్ (బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ) పట్టా పొందారు మరియు గతంలో చెన్నై మరియు బెంగళూరులో 2.5 సంవత్సరాలు నెట్‌వర్క్ కన్సల్టెంట్‌గా పనిచేశారు . ఆయన వేరే ఉద్యోగం చేస్తూనే లఘు చిత్రాలు చేయడం ప్రారంభించారు.

కిరణ్ అబ్బవరం ఫ్యామిలీ వైఫ్?

వారు ఆగస్టు 2024లో కర్ణాటకలోని కూర్గ్‌లో జరిగిన ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నారు. కిరణ్ అబ్బవరం మరియు రహస్య గోరక్ 21 జనవరి 2025న సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తమ గర్భధారణను ప్రకటించారు మరియు మే 22న వారికి మగబిడ్డ పుట్టాడు.

Read hindi News: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/tamannaah-bhatia-pak-cricketer-marriage-rumours-response/cinema/525601/

Breaking News Hanu Abbavaram Hanuman Jayanti Kiran Abbavaram latest news Telugu Celebrity News Telugu News Tirumala naming ceremony

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.