📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Kingdom Movie Review: కింగ్‏డమ్ సినిమా రివ్యూ!

Author Icon By Ramya
Updated: July 31, 2025 • 12:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కింగ్డమ్ రివ్యూ: విజయ్ దేవరకొండ ఆశలు నిలబెట్టిందా?

Kingdom Movie Review: గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన కింగ్డమ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు, విజయ్ దేవరకొండ క్రేజ్ ఈ అంచనాలకు మరింత జోడించాయి. మరి ఈ చిత్రం విజయ్ (Vijay) ఆశలను నిలబెట్టిందా, లేదా అనేది చూద్దాం.

Kingdom Movie Review: కింగ్‏డమ్ సినిమా రివ్యూ!

కథాంశం

Kingdom Movie Review: తెలంగాణలోని అంకాపూర్‌కు చెందిన కానిస్టేబుల్ సూరి (విజయ్ దేవరకొండ). చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోయిన తన అన్న శివ (సత్యదేవ్) కోసం 18 ఏళ్లుగా వెతుకుతుంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక పోలీస్ ఆఫీసర్ సూరి అన్న వివరాలు చెప్పడంతో పాటు, అతడిని తిరిగి తీసుకురావడానికి ఒక అండర్ కవర్ ఆపరేషన్ (undercover operation) చేయాలని కోరతాడు. ఈ మిషన్ కోసం సూరి శ్రీలంకకు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ స్పైగా మారి మాఫియా గురించి తెలుసుకోవాలని సూరిని ఆదేశిస్తారు. శ్రీలంకలో సూరికి సహాయం చేయడానికి ఒక స్పై (భాగ్యశ్రీ బోర్సే) కూడా ఉంటుంది. అక్కడి నుంచి సూరి “మిషన్ శ్రీలంక” (Mission Sri Lanka) మొదలవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది అసలు కథ.

కథనం – దర్శకత్వం

మళ్లీ రావా, జెర్సీ వంటి ఎమోషనల్ డ్రామాలను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి, కింగ్డమ్ సినిమాతో దర్శకుడిగా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. మొదటి సన్నివేశం నుంచే తన మార్కును చూపించిన గౌతమ్, తెలుగు ఇండస్ట్రీకి కొత్త కానటువంటి గ్యాంగ్‌స్టర్ డ్రామాను సరికొత్తగా చెప్పడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఫస్టాఫ్ అద్భుతమైన విజయం సాధించింది. హీరో క్యారెక్టర్‌ను పరిచయం చేసిన విధానం చాలా బాగుంది. అక్కడి నుంచి శ్రీలంకకు వెళ్లిన తర్వాత కథనం మరింత వేగంగా సాగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే, గౌతమ్ ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లారు. ఫస్టాఫ్ మొత్తం చాలా వేగంగా సాగిపోతుంది. విజయ్ దేవరకొండ, సత్యదేవ్ వంటి ఇద్దరు పవర్‌ఫుల్ నటులు దొరకడంతో గౌతమ్ పని మరింత సులువైంది. వారు తమ నటనతో గౌతమ్ అనుకున్న సన్నివేశాలను మరింత బాగా ఎలివేట్ చేశారు. అన్నదమ్ముల మధ్య ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయింది. ఫస్టాఫ్ అంతా హీరో శ్రీలంక వెళ్లడం, అక్కడ స్పైగా మారడం, హీరో హీరోయిన్ ట్రాక్‌తో సాగిపోయింది. అసలైన కథ ఇంటర్వెల్‌కు సెటప్ అయింది. సెకండాఫ్ ఇంకాస్త వేగంగా వెళ్లి ఉంటే బాగుండేది, అయినా కూడా గౌతమ్ తన మార్కును చూపించారు. దానికి తోడు విజయ్ దేవరకొండ యాక్షన్ కూడా అద్భుతంగా ఉంది. ఫస్టాఫ్ వరకు ఎలాంటి లోపాలు లేకపోయినా, సెకండాఫ్ మాత్రం కాస్త నెమ్మదించింది. చివరి 20 నిమిషాలు మళ్లీ ఊపందుకుంది. సెకండ్ పార్ట్‌కు సరిపోయే లీడ్ ఇచ్చారు. గ్యాంగ్‌స్టర్ డ్రామాలను ఇష్టపడే వారికి ‘కింగ్డమ్’ ఒక మంచి ఎంపిక.

నటీనటుల ప్రదర్శన

విజయ్ దేవరకొండ చాలా అద్భుతంగా నటించారు. గత సినిమాలతో పోలిస్తే చాలా మెచ్యూర్డ్‌గా కనిపించారు. ఎమోషనల్ సన్నివేశాలలో కూడా అద్భుతంగా జీవించారు.

మరో ముఖ్యమైన పాత్రలో సత్యదేవ్ అద్భుతంగా నటించి మెప్పించారు.

హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే గ్లామర్‌కు కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో బాగా నటించింది.

ఇతర కీలక పాత్రలో మలయాళ నటుడు వెంకటేష్ అద్భుతంగా నటించారు. సినిమాలో అతని పాత్ర చాలా కీలకం. తన నటనతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు.

సాంకేతిక విభాగం

అనిరుద్ సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోసింది. ప్రతి సన్నివేశాన్ని తన సంగీతంతో బాగా ఎలివేట్ చేశారు. కేవలం అనిరుద్ కారణంగానే ‘కింగ్డమ్’ రేంజ్ మరింత పెరిగింది.

ఎడిటర్ నవీన్ నూలి షార్ప్ కట్స్ అందించారు. సెకండాఫ్ కాస్త నెమ్మదించినట్లు అనిపించినా, యాక్షన్ పార్ట్ దానిని కవర్ చేసింది.

గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు శ్రీలంక లొకేషన్స్‌ను ఎవరూ చూపించనంత అందంగా చూపించారు.

నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి.

దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మరోసారి తన రైటింగ్ పవర్‌ను చూపించారు. తెలుగు సినిమాకు సరికొత్త ఎమోషనల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాను అందించారు.

కింగ్‌డమ్ మంచి సినిమానా?

కింగ్‌డమ్ దాని సుదీర్ఘ రన్ టైమ్‌లో ఎక్కువ భాగం అధిక శక్తితో మరియు పొడి హాస్యం యొక్క చక్కని చిలకరించడంతో బౌన్స్ అవుతుంది. తాజా సంగీతం. దర్శకుడు షిన్సుకే సాటో చిత్రంలో స్వల్పభేదం లేకపోవచ్చు, కానీ మార్షల్ గ్లాసెస్ అభిమానులకు అలసిపోయినా ఆనందించే సమయం ఉంటుంది. తాజా సంగీతం.

Read hindi news: hindi.vaartha.com

Read Also:  Tamil Actor: తమిళ పవర్‌స్టార్ శ్రీనివాసన్ రూ.5 కోట్ల మోసం కేసులో అరెస్ట్

Breaking News Gautam Tinnanuri Kingdom Movie Kingdom Review latest news Telugu Movie Review Telugu News Vijay Deverakonda

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.