📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Kingdom Movie: కింగ్డమ్ ‘‘అద్భుతమైన అనుభూతి’’ అంటూ ట్వీట్ చేసిన కేటీఆర్ తనయుడు

Author Icon By Ramya
Updated: July 31, 2025 • 4:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్‌డమ్’ చిత్రం (Kingdom Movie) విడుదలై మంచి టాక్‌తో దూసుకుపోతుంది. ‘ఖుషి’, ‘లైగర్’, ‘ఫ్యామిలీ స్టార్’ వంటి వరుస పరాజయాల తర్వాత విజయ్ దేవరకొండ ఎంతో కసితో చేసిన ఈ చిత్రం విజయం సాధించడం ఆయన అభిమానులకు ఊరటనిస్తోంది.

ఈరోజు విడుదలైన ఈ సినిమా మార్నింగ్ షోల నుంచే సానుకూల స్పందనను అందుకుంటుంది. చాలా రోజుల తర్వాత టాలీవుడ్‌లో ఒక మంచి సినిమా వచ్చిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

సినిమాకు ప్లస్ పాయింట్లు

Kingdom Movie: ఈ సినిమా విజయానికి ముఖ్యంగా గౌతమ్ దర్శకత్వం, స్క్రీన్‌ప్లే, అనిరుధ్ అందించిన అద్భుతమైన నేపథ్య సంగీతం దోహదపడ్డాయి. అలాగే, విజయ్ దేవరకొండ మరియు సత్యదేవ్ నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ అంశాలన్నీ కలిసి సినిమాను ప్రేక్షకుల ఆదరణ పొందేలా చేశాయి.

కేటీఆర్ కుమారుడు హిమాన్షు ప్రశంసలు

ఈ సినిమా చూసిన తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావు (Himanshu Rao) కల్వకుంట్ల సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ఆయన X (గతంలో ట్విట్టర్) వేదికగా ఒక పోస్ట్ చేశారు.

“RTC X రోడ్స్‌లో నా స్నేహితులతో కలిసి ‘కింగ్‌డమ్’ సినిమా చూశాను. ఒక థియేటర్‌లో ఇంత మంచి అనుభూతి పొందడం నాకు ఇదే మొదటిసారి! స్క్రీన్ కూడా చాలా పెద్దగా ఉండ‌డంతో, ప్రేక్షకులంతా సినిమాను బాగా ఎంజాయ్ చేస్తూ అరుస్తున్నారు.

థియేట‌ర్‌ వాతావరణం మొత్తం గూస్‌బంప్స్ తెప్పించేలా ఉండ‌డ‌మే కాకుండా. చాలా ఎనర్జీ కనిపించింది. అలాగే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటన అద్భుతంగా ఉంది. సినిమా అయితే నాకు చాలా నచ్చింది” అని హిమాన్షు కల్వకుంట్ల పేర్కొన్నారు.

విజయ్ దేవరకొండ స్పందన

హిమాన్షు కల్వకుంట్ల పోస్ట్‌పై విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. “హిమాన్షు లవ్ యూ” అంటూ లవ్ ఎమోజీలను జోడించారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ స్పందన సినిమాకు మరింత పబ్లిసిటీని తెచ్చిపెట్టింది.

‘కింగ్‌డమ్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలా స్పందన లభించింది?

విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమాకు మార్నింగ్ షోల నుంచే మంచి స్పందన వచ్చింది. దర్శకుడు గౌతమ్ కథనంతో పాటు విజయ్, సత్యదేవ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.

హిమాన్షు కల్వకుంట్ల సినిమా చూసి ఏమన్నాడు?

RTC X రోడ్స్‌లో సినిమా చూసిన హిమాన్షు, థియేటర్ అనుభవం అద్భుతంగా ఉందని ప్రశంసించాడు. విజయ్ దేవరకొండ నటన బాగా నచ్చిందని సోషల్ మీడియాలో తెలిపాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Mahavatar Narasimha: 5 రోజుల్లోనే రూ.30 కోట్లు రాబట్టిన మహావతార్ నరసింహ

Anirudh Music Breaking News Himanshu Kalvakuntla Kingdom Movie latest news Telugu News Tollywood Hit 2025 Vijay Deverakonda

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.