
KHxRKReunion: నెల్సన్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన గ్లింప్స్ వీడియోను మేకర్స్ విడుదల చేయడంతో సోషల్ మీడియాలో భారీ స్పందన లభిస్తోంది.
Read Also:Vijay-Rashmika: రష్మిక మమ్మల్ని వివాహానికి పిలవదు: నటుడు ప్రమోద్‌శెట్టి

సూట్ ధరించి, గాగుల్స్ పెట్టుకొని స్టైలిష్ లుక్‌లో కనిపించిన రజనీ, కమల్ విజువల్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వారి స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది.
దాదాపు 47 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు లెజెండరీ నటులు మళ్లీ ఒకే ప్రాజెక్ట్‌లో కలవడం సినీ అభిమానులకు స్పెషల్ మోమెంట్‌గా మారింది. గతంలో వీరి కలయికలో వచ్చిన సినిమాలు క్లాసిక్‌గా నిలిచిన నేపథ్యంలో, ఈ కొత్త మల్టీస్టారర్‌పై భారీ హైప్ ఏర్పడింది. ఈ సినిమా కథ, ఇతర నటీనటుల వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాకపోయినా, మేకర్స్ నుంచి వచ్చే అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్లింప్స్ విడుదలతో ఈ చిత్రం ఇండియన్ సినిమాకు మరో బిగ్ బ్లాక్‌బస్టర్‌గా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: