📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Khauf Review : ‘ ఖౌఫ్’ సిరీస్ రివ్యూ!

Author Icon By Divya Vani M
Updated: April 19, 2025 • 6:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఓటీటీ ప్రపంచంలో హారర్ థ్రిల్లర్‌ జానర్‌కి ఎంత క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు భయంతోపాటు కథలోని మిస్టరీను ఆస్వాదించాలనుకునే వీక్షకులకు ఇప్పుడు మరో ఇంటెన్స్ హారర్ ఎక్స్‌పీరియన్స్‌ అందుబాటులోకి వచ్చింది.హిందీలో రూపొందిన “ఖౌఫ్” సిరీస్ ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ ద్వారా స్ట్రీమింగ్ అవుతోంది.ఎనిమిది ఎపిసోడ్లుగా రూపొందిన ఈ సిరీస్ శుక్రవారం నుంచే స్ట్రీమింగ్ లోకి వచ్చింది.

Khauf Review ‘ ఖౌఫ్’ సిరీస్ రివ్యూ!

కథలోకి వెళితే…

ఢిల్లీకి దూరంగా ఉన్న నిర్మానుష్య ప్రాంతంలోని ఓ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌కి ఈ కథ నేపథ్యం.హాస్టల్‌కి వార్డెన్‌గా ఉన్న గ్రేస్, అక్కడ నివసించే నిక్కీ, స్వెత్లానా, కోమలి, రీమా అనే అమ్మాయిలు కథలో ప్రధాన పాత్రధారులు.రీమా గర్భవతిగా ఉన్నప్పటికీ, అత్తింటి వేధింపుల వల్ల హాస్టల్లో ఉంటోంది.వారి ఎదురుగా ఉన్న రూములో ‘అనూ’ అనే యువతి ఆరు నెలల క్రితం చనిపోవడంతో ఆ రూమును ఎవరూ ఆశ్రయించరు.ఇదే సమయంలో, గ్వాలియర్‌కు చెందిన మాధురి అనే యువతి ఢిల్లీలో జాబ్ కోసం వస్తుంది. గతంలో ఆమె అరుణ్‌తో ప్రేమలో ఉండగా, ఒక ప్రమాదంలో ముగ్గురు ముసుగు దొంగల చేతిలో ఆమె లైంగిక వేధింపులకు గురవుతుంది. ఆ ఘటనను మర్చిపోవడానికిగాను మాధురి ఢిల్లీకి వెళ్లి ఉద్యోగం పొందుతుంది.అక్కడే ఒక హాస్టల్లో ఆమె ఉండగా, యాదృచ్ఛికంగా అదే అనూ రూమ్‌లో స్థిరపడుతుంది.ఆ తర్వాత కథ మెల్లగా ఉత్కంఠ కలిగించే మలుపులు తీసుకుంటుంది. హాస్టల్‌లో అబ్బాయిలు కనిపించకుండా పోవడం, వార్డెన్ సహా ఇతరులు ఏదో దాచే ప్రయత్నం చేయడం మొదలవుతుంది.ఇదిలా ఉండగా, హకీమ్ అనే వ్యక్తి ఢిల్లీలో నరబలి ఇచ్చే పనులు చేస్తూ, ప్రేతాత్మలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు.ఇతని సహాయకుడిగా జీవా అనే కుర్రాడు ఉంటుంది.అతను ఆరేళ్లుగా కనిపించకపోవడం కథలో మిస్టరీని పెంచుతుంది.ఇదే సమయంలో మాధురికి ఆత్మ ఆవహిస్తుంది.తర్వాత ఆమె తీసుకునే నిర్ణయాలు, హకీమ్ చర్యలు, జీవా ఏమైపోయాడు అనే విషయాలు కథలో కీలకం.

సాంకేతికంగా చూస్తే…

సిరీస్ టేకింగ్, స్క్రీన్‌ప్లే పట్టు, కథనం బలంగా ఉన్నాయి.కథ మొదట మామూలుగా ప్రారంభమైనా, 5వ ఎపిసోడ్‌కి వెళ్లేసరికి వేగం పెరిగి థ్రిల్‌కి మరో స్థాయికి చేరుతుంది. హాస్టల్ బిల్డింగ్ లొకేషన్ కథకి ప్లస్ అయ్యింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, లైటింగ్, సినిమాటోగ్రఫీ అద్భుతంగా పనిచేశాయి. మోనికా పన్వర్, రజత్ కపూర్ నటన ప్రత్యేకంగా మెప్పిస్తుంది.“ఖౌఫ్” ఒక ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్. కథ, వాతావరణం, మిస్టరీ అంశాలు కలబోతగా ఈ సిరీస్ హారర్ ప్రేమికులకు మంచి ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది. మధ్యలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నప్పటికీ, ఫార్వార్డ్ చేస్తే మరొక లెవెల్ హారర్ ట్రిప్ అన్నమాట!

2025 Telugu Web Series Review Amazon Prime Khaauf Series Best Horror Series in Telugu OTT Streaming Review Telugu Telugu Horror Web Series Web Series Review in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.