కథే హీరోగా నిలిచిన ‘ఖైదీ’ – హార్ట్ టచ్ చేసే సాలిడ్ సినిమా
కొన్ని సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఎంటర్‌టైన్ చేస్తాయి. కొన్ని మాత్రం ప్రేక్షకుడి హృదయాన్ని తాకుతాయి. అలాంటి అరుదైన చిత్రాల్లో తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన ‘ఖైదీ’ ఒకటి. ఈ చిత్రం టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చింది. నయా ఫార్ములాలతో, కొత్త కథనాలతో, నటన ఆధారిత ప్రదర్శనతో రూపొందిన ఈ సినిమా, తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. సాంప్రదాయ సినిమాలకి భిన్నంగా ఇందులో పాటలు ఉండవు, హీరోయిన్ పాత్రే ఉండదు. అయినా మాత్రం థ్రిల్, ఎమోషన్, యాక్షన్ అన్నింటినీ కలగలిపి ప్రేక్షకులను కట్టిపడేసింది.
‘సినిమా అంటే కథ, కథన శైలి, నటనా నైపుణ్యం మాత్రమే ఉంటే సరిపోదు’ అన్న భావనను ఈ చిత్రం తప్పుబట్టింది. ఖైదీ సినిమా చూపించిన మార్గం చిన్న సినిమాలు ఎంత పెద్ద విజయాలు సాధించగలవో నిదర్శనం. ఓ వైపు స్టార్ హీరోలు, బడా డైరెక్టర్లు, భారీ బడ్జెట్లతో కూడిన కమర్షియల్ ఫార్ములాలే (Commercial formulas) మునుపటి వరకు సినిమా హిట్స్‌కు అద్దం పట్టేవి. కానీ ఖైదీ మాత్రం పూర్తిగా డిఫరెంట్. కథే హీరోగా నిలిచింది. కార్తీ పాత్రలో జీవించాడు. ఒక్కరే తెరపై నడిపించినా, ప్రేక్షకులు అక్షరాలా మెస్మరైజ్ అయ్యారు.
పాటలు లేవు.. హీరోయిన్ లేదు.. అయినా హిట్ ఖచ్చితం
ఇప్పటి వరకూ మనం చూసిన సినిమాల్లో స్పెషల్ సాంగ్స్, మాస్ ఫైట్స్, గ్లామర్ ఎలిమెంట్స్ తప్పనిసరిగా ఉంటాయి. కానీ ఖైదీ అందుకు పూర్తి భిన్నం. ఈ సినిమాలో హీరో తన కూతురిని కలవాలన్న ఒక్క లక్ష్యంతో కదులుతాడు. ఈ యాత్రలో ఎదురయ్యే మాఫియా, పోలీస్ వ్యవస్థ, అనేక అడ్డంకులను ఓ రాత్రిలో ఎదుర్కొన్న కథే ‘ఖైదీ’. కథనం అంతటా టెన్షన్, ఎమోషన్, యాక్షన్ నింపి, డైలాగ్స్‌కంటే విభిన్న విజువల్స్‌తో దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
ఈ సినిమాలోని ఫైట్స్ ప్రేక్షకులను కుర్చీలో కూర్చోనివ్వకుండా చేస్తాయి. ప్రతి ఎలివేషన్ సీన్, ప్రతి ట్విస్ట్ మెదడు మీద ఆడుతుంది. కేవలం కథే ఆధారంగా ఓ సినిమాను ఎలా సస్పెన్స్, థ్రిల్, ఎమోషన్‌తో నింపి చూపించాలో ‘ఖైదీ’ మాస్టర్ క్లాస్. ఇది హిట్ సినిమా కాదు.. ఇది ఓ అద్భుత అనుభూతి.
బడ్జెట్ కంటే భారీగా లాభాలు..
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రం, రూ.4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో థియేటర్లలోకి వచ్చి, రూ.7.15 కోట్ల షేర్‌ను సాధించింది. ఈ సినిమాకు రూ.3.15 కోట్ల నికర లాభాలు లభించాయి. యథార్థంగా చూస్తే ఇది చిన్న సినిమా. కానీ దీని విజయం మాత్రం పాన్ ఇండియా స్థాయిలో చర్చకు దారితీసింది. కథకు ప్రాధాన్యం ఇచ్చి రూపొందించిన సినిమాలు పెద్ద సినిమాలకు సవాల్ విసరగలవని ఖైదీ మరోసారి నిరూపించింది.
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో మొదటి అధ్యాయం
‘ఖైదీ’ చిత్రం డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సృష్టించిన LCU – లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో మొదటి భాగం. ఈ చిత్రంలో కొన్ని కీలక అంశాలు, పాత్రలు LCUలోని తర్వాతి చిత్రాలైన ‘విక్రమ్’, ‘లియో’లోకి కూడా సాగాయి. దీనితో, ఖైదీ కథను విస్తరించడానికి భారీ అవకాశాలు వచ్చాయి. ఇప్పటికే ఖైదీ సీక్వెల్‌పై అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం. ఫ్యాన్స్‌కి ఇది విందే కాక పండగ.
Read also: Rana Naidu 2:జూన్ 13 న ఓటీటీలోకి రానున్న ‘రానా నాయుడు 2’