📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే!

Khaidi 2: ఖైదీ 2 పై బిగ్ అప్డేట్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్

Author Icon By Ramya
Updated: August 6, 2025 • 4:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Khaidi 2: 2019లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘ఖైదీ’ సినిమాలో హీరో పాత్ర పేరు ఢిల్లీ. ఈ పాత్రను కార్తీ (Karti) అద్భుతంగా పోషించారు. తన అసమాన్య నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబట్టడంతో పాటు దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది.

Khaidi 2

కూలీ సినిమా విశేషాలు

Khaidi 2: ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మధ్య విడుదలైన కూలీ ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు టాలీవుడ్ హీరో నాగార్జున, సత్యరాజ్, ఉపేంద్రన్, శ్రుతి హాసన్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఖైదీ 2లో కమల్ హాసన్

లోకేష్ కనగరాజ్ రూపొందించిన ఖైదీ సినిమా LCU (లోకేష్ సినిమాటిక్ యూనివర్స్) లో మొదటి సినిమా కావడం విశేషం. ఈ సినిమా సాధించిన విజయం తర్వాత లోకేష్ ఇప్పుడు దీనికి సీక్వెల్ ‘ఖైదీ 2’ (‘Khaidi 2’) ను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో కమల్ హాసన్ కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. LCUలో భాగంగా కమల్ ఈ సినిమాలో కనిపిస్తారని కోలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కూలీ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఖైదీ 2 షూటింగ్ ప్రారంభం కానుంది.

లోకేష్ నిర్మిస్తున్న ఇతర సినిమాలు

లోకేష్ కనగరాజ్ ఖైదీ 2 తో పాటు ‘బెంజ్’ అనే మరో సినిమాను కూడా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తుండగా, నటుడు రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను కూడా LCU లో భాగంగా తీసుకురానున్నారని తెలుస్తోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో లోకేష్ మాట్లాడుతూ, ఈ సినిమా స్క్రీన్‌ప్లే సిద్ధంగా ఉందని, త్వరలోనే సినిమాను ప్రారంభిస్తామని చెప్పాడు.

లోకేష్ కనగరాజ్ నేపథ్యం ఏమిటి?

లోకేష్ కనగరాజ్ ఒక భారతీయ చిత్ర దర్శకుడు మరియు రచయిత, తమిళ సినిమాల్లో తన కృషికి ప్రసిద్ధి చెందారు. ఆయన 2016లో వచ్చిన ఆంథాలజీ చిత్రం అవియల్‌తో తన కెరీర్‌ను ప్రారంభించారు మరియు 2017లో యాక్షన్-థ్రిల్లర్ చిత్రం మానగరంతో తన తొలి చలనచిత్ర రంగప్రవేశానికి గుర్తింపు పొందారు. ఆయన కైతి (2019), మాస్టర్ (2021) మరియు విక్రమ్ (2022) చిత్రాలకు దర్శకత్వం వహించడం ద్వారా కూడా ప్రసిద్ధి చెందారు, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) అని పిలువబడే ఉమ్మడి విశ్వాన్ని సృష్టించారు.

LCU యొక్క మొదటి చిత్రం ఏది?

లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) లో మొదటి చిత్రం 2019 లో విడుదలైన కైథి. దీనికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు మరియు కార్తీ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం తరువాత “విక్రమ్” మరియు “లియో” లతో విస్తరించే అనుసంధాన కథాంశానికి పునాది వేస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/the-raja-saab-2-not-a-sequel-tg-vishwaprasad/cinema/526901/

Breaking News kamal-haasan khaidi-2 latest news lcu lokesh-kanagaraj rajinikanth-coolie Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.