📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Actress Pratyusha Case: ప్రత్యూష కేసులో కీలక మలుపు: నాంపల్లి కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థరెడ్డి

Author Icon By Aanusha
Updated: March 17, 2026 • 9:14 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Actress Pratyusha Case: టాలీవుడ్ నటి ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు ఒక కీలక అంకం ముగిసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి, ఈ కేసులో దోషిగా తేలిన సిద్ధార్థరెడ్డి మంగళవారం నాంపల్లి కోర్టులో లొంగిపోయారు. గత కొంతకాలంగా అమెరికాలో ఉంటున్న ఆయన, న్యాయస్థానం ఆదేశాల మేరకు స్వదేశానికి వచ్చి లొంగిపోవడం చర్చనీయాంశంగా మారింది.అనంతరం పోలీసులు సిద్ధార్థ రెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలించారు.

Read Also: Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు

అసలేం జరిగింది? (కేసు నేపథ్యం)

1993లో ప్రత్యూష, సిద్ధార్థరెడ్డి హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో ఇంటర్ చదివేటప్పుడు ప్రేమలో పడ్డారు. ఇంటర్మీడియట్ పూర్తైన తర్వాత సిద్ధార్థరెడ్డి ఇంజనీరింగ్ వైపు వెళ్లారు. ప్రత్యూష సినీ రంగాన్ని ఎంచుకున్నారు. వీరి వివాహానికి ప్రత్యూష తల్లి అంగీకరించినప్పటికీ.. సిద్ధార్థరెడ్డి తల్లి అంగీకరించలేదు. దీంతో 2002 ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం ఐదుగంటల సమయంలో సిద్ధార్థరెడ్డి పంజాగుట్టలోని బ్యూటీపార్లర్‌లో ఉన్న ప్రత్యూష వద్దకు వచ్చారు. ఆమెను కారులో తీసుకుని బయటికి వెళ్లారు. ఆ తర్వాత రాత్రి ఎనిమిది గంటల సమయంలో సిద్ధార్థరెడ్డి, ప్రత్యూష ఇద్దరూ ప్రాణాపాయస్థితిలో బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.

Key turning point in Pratyusha case: Siddhartha Reddy surrenders in Nampally court

ప్రత్యూష ఫిబ్రవరి 24న చనిపోయారు. మార్చి 9వ తేదీ సిద్ధార్థ రెడ్డి ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు.అయితే కూల్ డ్రింకులో పురుగుల మందు కలుపుతుని తాగి వీరు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో సిద్ధార్థ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. దీనిపై విచారణ నిర్వహించిన హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు.. నిందితుడు సిద్ధార్థరెడ్డికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, ఐదు వేల జరిమానా విధిస్తూ 2004లో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సిద్ధార్థరెడ్డి హైకోర్టులో సవాల్ చేయగా..

తెలంగాణ హైకోర్టు సిద్ధార్థరెడ్డికి విధించిన జైలుశిక్షను రెండేళ్లకు తగ్గించింది. అలాగే జరిమానాను రూ.5 వేల నుంచి రూ.50 వేలకు పెంచింది.అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థరెడ్డి, ప్రత్యూష తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిద్ధార్థ రెడ్డి శిక్షను పెంచాలంటూ ప్రత్యూష తల్లి కోరారు. ఈ పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు.. సిద్ధార్థ రెడ్డికి తెలంగాణ హైకోర్టు విధించిన శిక్షను ఖరారు చేసింది. నాలుగు వారాల్లోపు లొంగిపోవాలని ఆదేశించడంతో సిద్ధార్థ రెడ్డి నాంపల్లి కోర్టులో లొంగిపోయారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Actress Pratyusha Death Case Nampally court Siddhartha Reddy Surrender Supreme Court Verdict

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.