हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Latest News: Keerthy Suresh: ఎట్టకేలకు ‘రివాల్వర్ రీటా’ రిలీజ్ డేట్  ఫిక్స్

Anusha
Latest News: Keerthy Suresh: ఎట్టకేలకు ‘రివాల్వర్ రీటా’ రిలీజ్ డేట్  ఫిక్స్

కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘రివాల్వర్ రీటా’ చిత్రం ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు రేపింది. మహిళా కేంద్రిత కథలతో ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయోగాలు చేసే కీర్తి, ఈసారి ఒక విభిన్నమైన పాత్రలో కనిపించనుంది. టైటిల్‌నే బట్టి చూస్తే, ఈ సినిమా పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని స్పష్టమవుతోంది.

Read also: Chittoor accident: పవన్ పర్యటనలో అపశృతి.. మహిళకు గాయం

మరో మైలురాయిగా మారే అవకాశం

జే.కే చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్, కామెడీ యాక్టర్ రెడిన్ కింగ్స్లీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కీర్తి సురేష్‌ (Keerthy Suresh) కెరీర్‌లో ఇది మరో మైలురాయిగా మారే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఈ సినిమా షూటింగ్ చాలాకాలం క్రితమే పూర్తయింది.

అయితే కొన్ని కారణాలతో, సినిమా విడుదల వాయిదా పడింది. చివరికి మేకర్స్ తాజాగా ప్రకటించిన వివరాల ప్రకారం, ‘రివాల్వర్ రీటా’ సినిమా (‘Revolver Rita’ movie) థియేటర్లలోకి రానుంది. విడుదల తేదీతో పాటు కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

నవంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా

ఈ సినిమాని నవంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆవిష్కరించారు. ఇందులో కీర్తి సురేష్ చేతిలో గులాబీ పువ్వుతో నవ్వుతూ నిలబడగా, చుట్టూ ఉన్న రౌడీలతో ఆమెకు గన్స్ గురి పెట్టి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

‘రివాల్వర్ రీటా’ చిత్రాన్ని ప్యాషన్ స్టూడియోస్ & ది రూట్ బ్యానర్స్ పై సుధన్ సుందరం (మహారాజ నిర్మాత), జగదీష్ పళనిస్వామి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘రివాల్వర్ రీటా’ సినిమాకి సీన్ రోల్డాన్ మ్యూజిక్ సమకూర్చారు. ప్రవీణ్ కె ఎల్ ఎడిటింగ్ చేశారు.

దిలీప్ సుబ్బరాయన్ ఫైట్స్ కంపోజ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ ఆకట్టుకున్నాయి. త్వరలోనే ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. మరి కీర్తి సురేష్ కి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870