దక్షిణ భారత సినీ పరిశ్రమలో తన సహజమైన నటనతో, సున్నితమైన భావోద్వేగాలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న నటి కీర్తి సురేశ్ (Keerthy Suresh) 2024లో తన చిరకాల ప్రేమికుడు ఆంటోనీ తటిల్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ పెళ్లి అప్పట్లో సినీ వర్గాల్లో కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీర్తి సురేశ్ తన వివాహానికి సంబంధించిన ఆసక్తికరమైన, భావోద్వేగభరితమైన విషయాలను పంచుకున్నారు..
Read Also: Chiranjeevi: తన తల్లికి బర్త్ డే గ్రీటింగ్స్ తెలిపిన మెగాస్టార్
అస్సలు ఊహించలేదు
తాము 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నామని, ఒకానొక దశలో తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోతే పారిపోయి పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నట్లు ఆమె వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తమ పెళ్లి ఇంత వైభవంగా, అందరి సమక్షంలో జరుగుతుందని తాము అస్సలు ఊహించలేదని, కానీ చివరికి పెద్దల అంగీకారంతో గోవాలో కుటుంబ సభ్యుల మధ్య తమ వివాహం వేడుకగా జరిగిందని కీర్తి (Keerthy Suresh) పేర్కొంది. పెళ్లి సమయంలో జరిగిన భావోద్వేగ క్షణాలను గుర్తు చేసుకుంటూ,
ఎప్పుడూ చాలా ధైర్యంగా, దృఢంగా ఉండే ఆంటోనీ తాళి కట్టే సమయంలో తొలిసారి ఎమోషనల్ అయ్యాడని ఆమె తెలిపింది. ఆయన కళ్లలో నీళ్లు చూడటంతో తాను కూడా భావోద్వేగానికి లోనయ్యానని, 15 ఏళ్ల నిరీక్షణ కేవలం 30 సెకన్ల మంగళసూత్ర ధారణతో ఒక అందమైన బంధంగా మారిందని కీర్తి ఆనందం వ్యక్తం చేసింది. ఆ క్షణం ఒక కల నిజమైనట్లు అనిపించిందని, ఆ ఆనందంలో కన్నీళ్లు ఆగలేదని ఆమె చెప్పుకొచ్చింది
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: