బాలీవుడ్‌లో మరో ఆసక్తికర కాంబినేషన్ రూపుదిద్దుకుంటున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. యంగ్ యాక్షన్ స్టార్ టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కనున్న ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా ఎంపికైనట్లు చర్చ జరుగుతోంది.ఈ చిత్రంలో ‘తుపాకీ’ ఫేమ్ విద్యుత్ జమ్వాల్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. భారీ యాక్షన్ సన్నివేశాలతో రూపొందే ఈ సినిమాతో కీర్తి హిందీలో తన స్థానం మరింత బలపర్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: Korean Kanakaraju: వరుణ్ తేజ్ కొత్త చిత్రానికి టైటిల్ ఖరారు
‘అక్క’ కూడా విడుదలకు సిద్ధం
ప్రియుడు ఆంటోనీతో వివాహం తర్వాత కీర్తి సురేష్ (Keerthy Suresh) సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు. కానీ ఇప్పుడు మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చారు. తెలుగులో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘రౌడీ జనార్ధన’ లో కీర్తి కీలక పాత్ర పోషిస్తోంది. దీనితో పాటు తన మొదటి వెబ్ సిరీస్ ‘అక్క’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. తమిళం, మలయాళ భాషల్లో కూడా క్రేజీ ప్రాజెక్టులతో కీర్తి బిజీగా గడుపుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: