📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Vijay: కరూర్ తొక్కిసలాట.. విజయ్ కు శివరాజ్ కుమార్ కీలక సూచన

Author Icon By Anusha
Updated: October 9, 2025 • 10:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తన స్నేహితుడు, సూపర్ స్టార్ విజయ్‌ (Vijay) కు కన్నడ నటసింహం శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) విలువైన సూచనలు చేశారు. ఇటీవల తిరుచెందూర్ సుబ్రమణ్య స్వామి ఆలయాన్ని దర్శించిన ఆయన, మీడియాతో మాట్లాడుతూ విజయ్ రాజకీయ ప్రవేశంపై స్పందించారు.

Lakshmi Menon: కిడ్నాప్ కేసులో.. నటి లక్ష్మీ మీనన్‌కు కోర్టులో భారీ ఊరట

విజయ్ (Vijay) రాజకీయ రంగప్రవేశం చాలా పెద్ద నిర్ణయం. ప్రజల సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన ముందుకొచ్చారు. ఈ నిర్ణయాన్ని నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. అయితే, రాజకీయాల్లో అడుగులు చాలా జాగ్రత్తగా వేయాలి. ప్రతి నిర్ణయం, ప్రతి ప్రసంగం, ప్రతి చర్య ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతుంది.

అందుకే రాజకీయాల్లో ఉండే వ్యక్తి సమతుల్యతతో, ఓర్పుతో వ్యవహరించాలి” అని శివరాజ్ కుమార్ అన్నారు.అయితే ఇటీవలి కరూర్ తొక్కిసలాట (Karur stampede) వంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉందని గుర్తుచేశారు.కరూర్ ఘటన ఎలా జరిగిందనే దానిపై తనకు పూర్తి సమాచారం లేనప్పటికీ,

రాజకీయ వ్యూహాలను మరింత పదునుపెట్టి ముందుకు సాగాలని

భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా విజయ్ (Vijay) తన రాజకీయ వ్యూహాలను మరింత పదునుపెట్టి ముందుకు సాగాలని శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) ఆకాంక్షించారు. స్నేహితుడిగా విజయ్‌కు ఈ సూచన చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఇటీవల కరూర్‌లో విజయ్ పార్టీ ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే) నిర్వహించిన ర్యాలీలో భారీ తొక్కిసలాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

vijay

ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారం

ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపింది. పోలీసులు కేవలం 10,000 మందికి మాత్రమే ర్యాలీకి అనుమతి ఇవ్వగా, దాదాపు 30,000 మంది హాజరుకావడంతో ఈ విషాదం జరిగిందని అధికారులు వెల్లడించారు.ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ (M.K. Stalin) తీవ్రంగా స్పందించారు.

ప్రోటోకాల్ నిబంధనలను ఉల్లంఘించారంటూ విజయ్ పార్టీపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, టీవీకే (TVK Party) ఈ ఆరోపణలను ఖండించింది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు (Supreme Court) పర్యవేక్షణలో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. మరోవైపు, ఈ విషాద ఘటనపై స్పందించిన విజయ్, మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News Kannada actor Shivarajkumar latest news Tamil Nadu Politics Telugu News Vijay political entry

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.