📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Kanya kumari Movie – కన్యాకుమారి (ఆహా) మూవీ రివ్యూ

Author Icon By Anusha
Updated: September 18, 2025 • 3:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవలి కాలంలో తెలుగు సినిమా రంగంలో చిన్న చిత్రాలు ప్రత్యేకమైన దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంతో కూడిన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తున్నాయి. అందులో భాగంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం ‘కన్యాకుమారి’ (Kanya kumari Movie). ఈ సినిమా గ్రామీణ వాతావరణంలో సాగే కథతో రూపొందినందున ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ చిత్రానికి దర్శకునిగా, నిర్మాతగా సృజన్ అట్టాడ (Srujan Attada) వ్యవహరించడం విశేషం. రెండు బాధ్యతలను ఒకే వ్యక్తి నిర్వర్తించడం చిన్న సినిమాల్లో అరుదుగా కనిపించే విషయం. కంటెంట్‌పై నమ్మకముండడం వల్లనే సృజన్ ఈ రిస్క్ తీసుకున్నారని చెప్పవచ్చు. కథలో ప్రధాన పాత్రల్లో శ్రీచరణ్ రాచకొండ, గీత్ సైనీ నటించారు.

కథ

ఈ ఇద్దరి పాత్రల చుట్టూ తిరిగే కథలో గ్రామీణ జీవన శైలి, అక్కడి సామాజిక పరిస్థితులు, కుటుంబ సంబంధాలు వంటి అంశాలను హృదయానికి హత్తుకునేలా చూపించారని చిత్రబృందం చెబుతోంది.అయితే,ఆగస్టు 27న థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ నెల 17వ తేదీ నుంచి ‘ఆహా’ (aha) లో స్ట్రీమింగ్ అవుతోంది.మరి ఈ మూవీ ఎలా ఉందొ రివ్యూ లో చూద్దాం.

ఈ కథ ‘శ్రీకాకుళం’ నేపథ్యంలో నడుస్తుంది. కన్యాకుమారి ( గీత్ సైనీ) ఓ మిడిల్ క్లాస్ అమ్మాయి. తను బాగా చదువుకుని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కావాలనేది ఆమె ఆశ .. ఆశయం. అయితే ఇంట్లో వాళ్లు ఆ విషయాన్ని లైట్ తీసుకోవడం వలన, గవర్నమెంట్ కాలేజ్ లో డిగ్రీ పూర్తి చేస్తుంది. శ్రీకాకుళంలోని ఒక బట్టల దుకాణంలో సేల్స్ గళ్ గా పనిచేస్తూ ఉంటుంది. అయినా ఇంజనీర్ కావాలనే కోరిక .. సిటీలో సెటిలైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఆమెలో అలాగే ఉంటాయి. 

కథనం

ఆ పక్కనే ఉన్న ‘పెంటపాడు’లో తిరుపతి అనే యువకుడు ఉంటాడు. అతను 7వ క్లాస్ వరకూ కన్యాకుమారితోనే కలిసి చదువుతాడు. అయితే వ్యవసాయం పట్ల గల ఇష్టంతో చదువు మానేస్తాడు. వ్యవసాయం (Agriculture) చేస్తున్న కారణంగా అతనికి పెళ్లి సంబంధాలు రాకుండా పోతుంటాయి. దాంతో తనకి పెళ్లి కాదేమోనని తిరుపతి బెంగ పెట్టుకుంటాడు. ఆ సమయంలోనే అతను కన్యాకుమారితో మాటలు కలుపుతాడు. ఆమెకి దగ్గర కావడానికి ప్రయత్నిస్తాడు. 

Kanya kumari Movie

అప్పుడు కన్యాకుమారి (Kanya kumari) తన మనసులోని మాటను చెబుతుంది. తనకి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కావాలనే ఆశ ఉందనీ, సిటీలో జాబ్ చేసే వ్యక్తినే తాను పెళ్లి చేసుకుంటానని తేల్చి చెబుతుంది. అప్పుడు తిరుపతి ఏం చేస్తాడు? ఆమె కోసం అతను వ్యవసాయం మానేస్తాడా? సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కావాలనే కన్యాకుమారి కోరిక నెరవేరుతుందా? అనే మలుపులతో ఈ కథ ముందుకు వెళుతుంది. 

విశ్లేషణ

జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒక బలమైన కోరిక ఉంటుంది .. తప్పకుండా సాధించాలనే  ఆశయం ఉంటుంది. అయితే ఆ ఆశయం దిశగా సాగే ప్రయాణంలో, ఒక్కోసారి నచ్చిన వ్యక్తులకు దూరం కావలసి వస్తుంది. అప్పుడు ఆ వ్యక్తులను వదులుకోవాలా? ఆశయాన్ని వదులుకోవాలా? అనే ఒక డైలమా చాలా మందికి ఎదురవుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు కన్యాకుమారి ఏం చేసింది? అనేదే ఈ సినిమా కథ. 

మనం ఇష్టపడేవారి కోసం మన ఇష్టాలను కొన్ని వదులుకుని వెళ్లడమనేది ప్రేమలో ఒక కోణం. మనలను ప్రేమించేవారు మనం కోసం ఏమైనా వదులుకుని రావడమనేది మరో కోణం. అయితే ఎవరి కోసం ఎవరు త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు? అనేది వాళ్ల మనసులలో అవతల వ్యక్తి పట్ల ఉన్న ప్రేమకి కొలమానంగా నిలుస్తుంది. ఈ కథలో అలాంటి ఒక త్యాగం ఎవరు చేశారనే దిశగా దర్శకుడు ఆసక్తిని రేకెత్తించిన తీరు ఆకట్టుకుంటుంది. 

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/deepika-padukone-out-of-kalki-2/cinema/549634/

august 27 theatrical release Breaking News geeth sainee kanyakumari movie latest news rural backdrop stories small films trend sricharan rachakonda srujan attada director producer Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.