📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Latest News: Prabhas: కాంతార: ఛాప్టర్ 1 పై ప్ర‌భాస్ ఏమన్నారంటే?

Author Icon By Anusha
Updated: October 3, 2025 • 2:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 2న విడుదలైన “కాంతార: ఛాప్టర్ 1” ( Kantara Chapter 1) ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుంటోంది. రిషబ్ శెట్టి (Rishab Shetty) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా ఫాంటసీ డ్రామా మరోసారి సినిమా ప్రపంచంలో విశేష చర్చకు దారితీస్తోంది.

Final Destination bloodlines : ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్లు OTT లో ఎప్పుడూ, ఎక్కడ చూడాలి?

ఈ చిత్రాన్ని ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఇండస్ట్రీ ప్రముఖులు కూడా అభినందిస్తున్నారు. ఇప్పటికే “మ్యాన్ ఆఫ్ మాసెస్” జూనియర్ ఎన్టీఆర్ సినిమా బాగుందని ట్వీట్ చేయగా, తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అర్జున్ రెడ్డి ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కూడా సినిమా గురించి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు.దర్శకుడు సందీప్ రెడ్డి వంగా “కాంతార: ఛాప్టర్ 1 నిజమైన మాస్టర్ పీస్” అంటూ సినిమా గురించి ప్ర‌శంస‌లు కురిపించారు.

“ఇండియన్ సినిమా చరిత్రలో ఇలాంటి సినిమాను ఎప్పుడూ చూడలేదు. ఇది ఓ సినిమాటిక్ ప్రభంజనం. భక్తి ఎలా ఉంటుందో రిషబ్ అద్భుతంగా చూపించారు. ఇది ఆయన ఒంటి చేత్తో తీసిన సినిమానే కాదు, ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. సినిమా బీజీఎమ్‌ను ఎంతగా పొగడినా తక్కువే,” అంటూ పేర్కొన్నారు.

Prabhas

ప్రభాస్ తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ

అలాగే, ప్రభాస్ (Prabhas) తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. “కాంతార: ఛాప్టర్ 1 అనేది ఒక బ్రిలియంట్ మూవీ. ఇది ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది. ఈ సినిమాకు అసలు శక్తి అంటే రిషబ్ శెట్టి నటన. ఆయన నటనలో కనిపించిన భక్తి, శక్తి అసాధారణం.

అలాగే నిర్మాత విజయ్ కిరగండూర్ (Vijay Kiragandur) అద్భుతంగా సినిమాను రూపొందించారు. చిత్ర యూనిట్‌కు నా హృదయపూర్వక అభినందనలు” అని పేర్కొన్నారు.సినిమా విడుదలైన రోజే జూనియర్ ఎన్టీఆర్ సినిమా చూసి స్పందించగా, “ఇది కచ్చితంగా మరో స్థాయిలో తీసుకెళ్లే సినిమా.

రిషబ్ శెట్టికి ప్రత్యేక శుభాకాంక్షలు,” అంటూ ట్వీట్ చేశారు. కేవలం ప్రేక్షకుల నుంచి మాత్రమే కాకుండా విమర్శకుల నుంచి కూడా ఈ చిత్రానికి హై రేటింగ్స్ (High ratings) వస్తున్నాయి. డివోషనల్ సబ్జెక్ట్‌ను కళాత్మకంగా, కమర్షియల్ గా చూపించి ప్రేక్షకులను ఆలోచింపజేసేలా తీర్చిదిద్దిన విధానం ప్రశంసలందుకుంటోంది.

రిషబ్ శెట్టి మరోసారి తన కంటెంట్ ఎంపికలో ఎంత విలక్షణంగా ఆలోచిస్తాడో నిరూపించుకున్నాడు. ‘కాంతార: ఛాప్టర్ 1’కు మద్దతుగా స్టార్ హీరోలు స్పందించడం, సినిమా విజయం పట్ల గర్వంగా ఫీలవడం ఫ్యాన్స్‌కు సైతం ఆనందాన్ని కలిగిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Audience Response Breaking News dasara festival release fantasy drama film Kantara Chapter 1 kantara release october 2 latest news Pan India Movie Rishab Shetty Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.