📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Kannada Film Industry: దర్శకుడు జో సైమన్ కన్నుమూత

Author Icon By Anusha
Updated: February 14, 2026 • 11:04 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కన్నడ చిత్ర ప్రముఖ దర్శకుడు, నటుడు జో సైమన్ (80) కన్నుమూశారు. నిన్న ఫిల్మ్ ఛాంబర్ సమావేశానికి వెళ్లిన ఆయన గుండెపోటుతో కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. . సాహస సింహా, సింహా జోడి వంటి పాపులర్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. రవివర్మ, మణి, టైమ్ బాంబ్ తదితర సినిమాల్లో నటించారు. ఆయన మరణంపై కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ విచారం వ్యక్తం చేశారు.

Read Also: Palash Muchhal: మహిళా క్రికెటర్ స్మృతి ఫ్రెండ్‌కు హైకోర్టు వార్నింగ్

Kannada Film Industry: Director Joe Simon passes away

ప్రముఖులు సంతాపం

1946లో మండ్యలో జన్మించిన జో సైమన్, 1967లో కన్నడ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. నటుడిగా, దర్శకుడిగా, గీత రచయితగా 100కు పైగా చిత్రాల్లో పనిచేశారు. దివంగత లెజెండరీ నటులు విష్ణువర్ధన్ , అంబరీష్‌లతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. వారితో కలిసి పలు సూపర్ హిట్ చిత్రాలకు పనిచేశారు. రవి వర్మ, మణి, టైమ్‌ బాంబ్‌ వంటి సినిమాల్లో సైమన్‌ నటించారు. జో సైమన్ మృతి పట్ల కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. కర్ణాటక కన్నడ, సంస్కృతి శాఖ మంత్రి శివరాజ్ తంగడగి స్పందిస్తూ.. “కన్నడ చిత్ర పరిశ్రమ ఒక డైనమిక్, సృజనాత్మక దర్శకుడిని కోల్పోయింది. ఆయన ఎంతోమంది కొత్త టాలెంట్‌ను పరిశ్రమకు పరిచయం చేశారు” అని కొనియాడారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Joe Simon death Kannada film director latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.