బాలీవుడ్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్‌పై హాట్ హాట్ టాక్ నడుస్తోంది. స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించనున్న జాంబీ యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రళయ్’ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా ఈ సినిమాలో లీడింగ్ లేడీగా నటి కళ్యాణి (Kalyani Priyadarshan) ఎంపికైనట్టు ప్రచారం సాగుతోంది. ఈ సినిమా పోస్ట్-అపోకలిప్టిక్ జాంబీ సర్వైవల్ స్టోరీగా రూపొందనుందని సమాచారం.భారీ వీఎఫ్ఎక్స్, వరల్డ్ బిల్డింగ్, ఎమోషనల్ డెప్త్‌తో ఈ చిత్రాన్ని హాలీవుడ్ స్టైల్‌లో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు
ఈ సినిమాకు జై మెహతా దర్శకత్వం వహించనుండగా, ఇది ఆయన ఫీచర్ డైరెక్టోరియల్ డెబ్యూ కావడం విశేషం.‘మా కసమ్ ఫిల్మ్స్’ బ్యానర్‌పై హన్సల్ మెహతా ట్రూ స్టోరీ ఫిల్మ్స్, సమీర్ నాయర్ అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రణ్‌వీర్ సింగ్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
2026 ఏప్రిల్ నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని బాలీవుడ్ టాక్. ఇదిలా ఉండగా, ప్రస్తుతం కళ్యాణి (Kalyani Priyadarshan) పలు తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ముఖ్యంగా తమిళ స్టార్ హీరో కార్తి సరసన నటించనున్న భారీ బడ్జెట్ చిత్రం ‘మార్షల్’పై భారీ అంచనాలున్నాయి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: