📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Kalyani Priyadarshan: కార్తీ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్?

Author Icon By Anusha
Updated: December 6, 2025 • 3:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘హలో’ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైన కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan), ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా తన అందం, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘చిత్రలహరి’లో కీలక పాత్రలో నటించినా, తెలుగులో పెద్ద బ్రేక్ మాత్రం దక్కలేదు. దీంతో మలయాళ చిత్రసీమపై ఎక్కువ ఫోకస్ పెట్టిన ఆమె, అక్కడ మంచి కథలు ఎంచుకుంటూ తన స్థానం బలపరుచుకుంది.

Read Also: Dies Irae Movie: ‘డీయస్ ఈరే’ (జియో హాట్ స్టార్)మూవీ రివ్యూ

మలయాళ చిత్ర పరిశ్రమలోనే ‘ లోక చాప్టర్ 1 చంద్ర ’ బ్లాక్‌బస్టర్‌

తాజాగా విడుదలైన ‘ లోక చాప్టర్ 1 చంద్ర ’ సినిమా (‘Loka Chapter 1 Chandra’ movie) లో ఆమె పోచించిన పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కంటెంట్‌, స్క్రీన్‌ప్లే, ప్రెజెంటేషన్‌తో పాటు కళ్యాణి నటన కూడా సినిమా విజయంలో కీలకంగా మారింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సుమారు 300 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. ఇది కళ్యాణి కెరీర్‌లోనే కాదు మలయాళ చిత్ర పరిశ్రమలోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలవడం విశేషం.

ప్రస్తుతం ‘జెన్నీ’ అనే చిత్రంలో నటిస్తున్న కళ్యాణి (Kalyani Priyadarshan), తాజాగా ఓ భారీ బడ్జెట్ చిత్రంలో ఛాన్స్ కొట్టేసిందని సమాచారం. అది ఏకంగా 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఒక క్రేజీ ప్రాజెక్ట్ కావడం విశేషం. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో కార్తీకి జంటగా ఆమె నటించనుందని టాక్.

Kalyani Priyadarshan in Karthi’s movie?

కళ్యాణి గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది

ఒకవైపు ‘వా వాతియార్’, మరోవైపు ‘సర్దార్ 2’ వంటి సినిమాలతో కార్తీ బిజీగా ఉండగా, ఆయనతో కలిసి ఈ భారీ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం కళ్యాణికి రావడం ఆమె కెరీర్‌లో మరో కీలక ముందడుగుగా చెప్పుకోవచ్చు. మొత్తానికి ‘లోక’ మూవీ విజయం తర్వాత కళ్యాణి ప్రియదర్శన్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది.

సరైన సినిమా పడితే స్టార్‌డమ్ ఎంత వేగంగా దక్కుతుందో ఆమె ఉదాహరణగా నిలుస్తోంది.రూ.100 కోట్ల ప్రాజెక్ట్ నిజమైతే కళ్యాణి కెరీర్ మరో కొత్త స్థాయికి చేరడం ఖాయమన్న అభిప్రాయం సినీ వర్గాల్లో వినిపిస్తోంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Jenny movie kalyani priyadarshan Karthi new movie latest news new big budget film Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.