భారతీయ స్క్రీన్‌పై సూపర్ ఉమెన్ కాన్సెప్ట్‌తో వచ్చి అఖండ విజయాన్ని అందుకున్న సినిమా ‘కొత్తలోక: చాప్టర్ 1’. కేవలం మౌత్ టాక్‌తోనే కాసుల వర్షం కురిపించిందీ సినిమా. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 300కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అంతేకాదు, ఒక మలయాళ చిత్రానికి ఈ స్థాయి వసూళ్లు రావడం కూడా ఇదే ప్రథమం.
Read Also: Aamani: ఇవాళ BJPలో చేరనున్న నటి ఆమని?
భయంతో బయటికి కూడా రాలేదు
అయితే ఈ విజయానికి ముందు తాను ఎంతో భయపడ్డానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో కళ్యాణి (Kalyani Priyadarshan) వెల్లడించింది. ‘లోక చాప్టర్ 1: చంద్ర’ విడుదల రోజు తాను విపరీతమైన టెన్షన్‌కు గురయ్యానని చెప్పింది. ‘‘నన్ను ప్రేక్షకులు సూపర్ హీరోగా అంగీకరిస్తారో లేదో అన్న భయం వెంటాడింది. విడుదల రోజు భయంతో బయటికి కూడా రాలేదు. నాతో పాటు మా టీమ్ అంతా విమర్శలు వస్తాయేమోనన్న ఆందోళనతో గదుల్లోనే ఉన్నాం.
మధ్యాహ్నం వరకు మాకు ఉపశమనం లేదు. కానీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత మంచి రివ్యూలు వస్తున్నాయని తెలిసిన వెంటనే అందరం బయటికి వచ్చి సంబరాలు చేసుకున్నాం’’ అంటూ ఆమె ఆనాటి అనుభవాలను గుర్తు చేసుకుంది. తాము ఎంత భయపడ్డామో అంతకంటే ఎక్కువగా ప్రేక్షకుల స్పందన రావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని (Kalyani Priyadarshan) చెప్పుకొచ్చింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: